పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/592

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ధర్మాధర్మాభిమానదేవతలు, ఆత్మవృత్తిప్రకారముఁ దెల్పుట

వ.

నాకును వేదాంతసుచికిత్సకులవలన దోషరహితులు గాఁగలరు, ఒక
ముహూర్తంబు సహింపుండని కాలాభిమానదేవత పల్కిన సస్మితాన
నుండై ధర్మాధర్మాభిమానదేవతలం జూచిన వారలు ప్రణమిల్లి యాత్మ
వృత్తిప్రకారం బిట్లని విన్నవించి రప్పుడు మాకు సాక్షి యనంతశాఖ
వేదాభిమానము గల్గిన నిత్యదేవత. ఈనిత్యదేవత పల్కినపల్కు
శంకించరాదు; నిరామయ మైనది; మానడకల కిది సాక్షి యగుట స్వభావ
శిష్ట మీదేవత యాజన్మసిద్ధతత్త్వజ్ఞానాబ్ధిమానస యైనది; పరమార్ధయై
సమగ్రయై యవ్యభిచారియై యున్న భవత్పాదభక్తి గలుగుటచేత నిత్య
సుఖం బందియున్నయది; యటువంటిదేవతత్వత్పాదపద్మగాదోద్రిక్తభక్తి
సుధాంబుధియందు నుప్పొంగి భవత్సౌభాగ్యామృతసాగరము సొచ్చి
యప్రాకృతానంతకల్యాణచిత్సుఖ మనుభవింపుచు నిత్యులను ముక్తులం
జూచుచుఁ బ్రమోదించినయదియై బద్ధులను దేవత [1]కటాక్షింపని
చంచంబునఁ దానును నిరీక్షింపక యనాదిత్రిగుణానాత్మాచ్ఛాదితాజాన
చిద్బలమువలన దేవనరతిర్యక్స్థావరప్రభేదదేహంబులు వహించిన
వారలం జూచి కరుణ గలిగి వారికింగా నిట్లనియె: స్వామీ! ఈయాత్మ
లకు దేవతోద్దేశవిరహితమైన యీకర్మము హితము విశుద్ధోపదేశాది
దేశప్రాప్తోచితాంగక మై సత్కులోచితమైన యీకర్మంబు ప్రాకృతంబు
వైకృతంబునై రెండుతెఱంగు లయ్యె నది వర్ణాశ్రమవయోపస్థావేశాది
ప్రవిభావికమై తపోదానపూర్తంబులచేఁ జేయంబడెనేని శ్రేయస్సు నిచ్చు;
సుతానుక్షణధ్వంసియైన నే నీస్వస్థితీక్షణమునందె చోదితమై యుద్దేశ్య
దేవతను బ్రసన్నఁ గావించిన తత్ఫలము నధికారికి [2]నిప్పింపఁగలదు;
ఆదేవతవేరు మఱొకవస్తువ యెందుఁ బ్రయోగించెనేని తచ్ఛబ్దవాచ్య
యైన దేవత [3]యాయర్థ మయ్యెడిది సిద్ధము; తా నెఱుంగనియంతమాత్ర
ముననె యీదేవతకు నజ్ఞానంబు లేదు; హవిరావిగ్రహణదేవతా
వాచకంబులైన శబ్దములచేతఁ జెప్పఁబడిన దేవత జ్ఞానము గలదియై
తనుం బూజించెడివారికొఱకు తత్పూజభక్తిప్రసన్నయై శుభము నిచ్చు;
నజ్ఞులు తఱచుగాఁ బ్రయోగించినమాత్రంబున నది వానికి నర్ధంబు
గాదు; మఱి యేమి [4]యనఁ దత్త్వజ్ఞులైనవారు బోధించిన నెఱుంగంబడు;
నిటువలెం గాకుండెనేని యతిప్రసంగంబౌ; నది [5]యెట్లన: నజ్ఞులైనవారు
పెక్కుమాఱు లహంపదము దేహంబునందుఁ బ్రయోగించిన యంత

  1. కటాక్షించని
  2. నిప్పించ
  3. యార్థ
  4. యంటె
  5. యెట్లంటే