పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/551

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వైకుంఠలోకము – ఆవరణపంచకము

వ.

ఈపరబ్రహ్మలోకవర్ణనంబు సేయ నేరికి శక్యంబు గాదు. కావున
సంగ్రహంబున నెఱింగింపు మని యడిగితివి. ఏనును సంక్షేపంబునం
బల్కితి. ఇది వినువారికి బుద్ధియు నోజస్సుఖవివృద్ధియు కార్య
సిద్ధియు నగు. విశేషంబున మరియు వైకుంఠలోకంబు వర్ణించెద
వినుము. ప్రాగవాచిని శ్రీలోకంబును బశ్చిమంబున శ్రీవైకుంఠంబు
నకు దక్షిణంబున నిత్యానందంబునిధియు సద్భక్తవరదుండు నగు
సంకర్షణవిభుం డుండు. ఆసంకర్షణలోకంబునకు పశ్చిమంబున
నిర్మలానందనీరధినిత్యంబు నగు సరస్వతి లోకంబులఁ దగు ప్రత్యగ
వాచి[1]ని సరస్వతిలోకంబున కుత్తరంబునఁ బ్రద్యుమ్నలోకంబు
చెలంగు. ప్రతీచీనయుతార్కేందుప్రభ దీపించి నిర్మలశర్మదంబై
ప్రద్యుమ్నపదంబుదగ్గర రవిదిక్కున నిత్యాప్సరో౽లంకృతంబై
రతిలోకంబు విరాజిల్లు. తత్ప్రాచీన అనిరుద్ధలోకంబు రాణించు నుదీచిం
బ్రకాశించి యానందవారిధి యగు నాయనిరుద్దలోకంబునకుఁ బ్రాచి
యగు విదిక్కున సద్గుణసాగరం బగు శాంతిలోకంబు విజృంభించు.
ఇవి చతుర్వ్యూహంబులు నాలుగు శ్రీకళలు. నాలుగును బ్రదక్షిణ
క్రమంబునఁ బ్రాచ్యాద్యష్టదిక్కులం బ్రకాశించు నీవ్యూహాష్టకంబు
ప్రథమావరణంబున నుండు. 'మధ్యే మధ్యేత్వ సంఖ్యే యా స్తత్త
ద్వ్యూహ' [2]మ్మనిన శ్రుతివలన ననేకవ్యూహంబులు గలవు. ద్వితీయా
వరణంబునం బ్రాచ్యాదిదిక్కుల వరాహజామదగ్న్యశ్రీనరసింహ
రఘువల్లభశ్రీధరవామనహయగ్రీవవాసుదేవలోకంబులు గలవు.
తదధిపతులు విభవేశ్వరులు నిత్యులు. వీరు వ్యూహాష్టవిశిష్ట
శ్రీవైకుంఠేశ్వరప్రీతిసాధనంబైన బ్రహ్మవిద్య నర్వాచీనప్రాకృత
భూముల నవతరించి ప్రకాశింపఁజేయుదు రీమూర్తులం గొల్చిన
నపవర్గంబు లభించు. తృతీయావరణంబున నెనిమిదిదిక్కుల పాంచ
జన్యముసలచక్రఖడ్గగదాశార్ఙ్గాదివైజయంతంబులు నిలుచు. నిత్యాన
వధికనిరతిశయానందం బగు భగవత్సేవ గావించు. చతుర్ధావర
ణంబునఁ గుముదకుముదాక్షపుండరీకవామనశంఖకర్ణసర్ప

  1. చే
  2. యనిన