పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/545

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


తే. గీ.

మున స్వరమ్మున ధ్యానించి వనజగర్భ
శంకరేంద్రాదులకు [1]లేని సకలపూర్ణ
పరమధామంబుఁ గాంతురు పరమధామ
భూమ మానిత్యశూరులు పొగడికొనఁగ.

139


వ.

మఱియుఁ బురాణోత్తరంబులం బలుకంబడియె.

140


తే. గీ.

వహ్నిసంతప్తచక్రంబు వైష్ణవాగ్ర
వరుని శోధించి తద్భుజద్వయమునందు
మూలముల చిహ్న మొనరింప మూల మఖిల
వర్ణముల కచ్యుతావాసవాసములకు.

141


వ.

మఱియు భగవంతుఁ డానతి యిచ్చిన యూర్ధ్వపుండ్రధారణ
క్రమంబు వినుము.

142


తే. గీ.

అమలమును బార్శ్వమూలాగ్ర మధికఋజువు
లైన పుండ్రంబు మత్ప్రియం బగుటఁ జేసి
యట్టి విమలోర్ధ్వపుండ్రముల్ సాంతరములు
గా నొనర్చిన నాకు [2]నాగాము లగును.

143


క.

అచ్ఛిద్రకోర్వపుండ్రం
బిచ్ఛావిధితో వహించు నెవ్వఁ డతం డా
పచ్ఛటలం బొంది సదా
విచ్ఛిన్నాఘనిరయైకవింశతి మునుఁగున్.

144


శా.

దండాకారము నూర్ధ్వపుండ్రము సముద్దండంబుగా భూసురేం
ద్రుం డత్యుత్తమశీలవైష్ణవకులాగ్ర్యుండైన సచ్ఛిద్రమై
యుండన్ బూరమతిన్ నమోంతములుగా యోజించి లక్ష్మీకళ
త్రుండౌ మేలనఁ గేశవాదుల కుభారూఢిన్ వహింపన్ దగున్.

145


తే. గీ.

భూమి నచ్ఛిద్రముగ నూర్ధ్వపుండ్రమే ద్వి
జాధములు దాల్తు రచ్చోట హరియు సిరియు
నధివసింపంగ మీరు వా రతివిమూఢు
లైహికాముష్మికసుఖంబు లందలేరు.

147