పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/529

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


సీ.

సత్వరజస్తమస్సంజ్ఞికంబగు గుణ
                       త్రయము దాను ద్రిపత్కృతమయి యున్నఁ
గుటిలరజస్తమోగుణముల గణసత్వ
                       సత్వగుణస్ఫూర్తి సంభవించు
నొకవేళ యది గాన నుత్కటసంసార
                       వర్తి యయ్యును మోక్షవాంఛ సేయు
నాసత్వగుణమున నంతయు మోక్షోద
                       యంబైన నూరిజనంబు మోక్ష


తే. గీ.

హేతు వడిగిన నుపదేశ మిత్తు రార్యు
లందునకు మాట వేదంబె యనుచు [1]నండ్రు
గాన వేదపథోపదేశానువృత్తిఁ
దిరుగువారికి మోక్షంబుసిరి లభించు.

73


సీ.

గురుతమోగుణరజోగుణసముద్రేకద
                       శ ల్ప్రాప్తమై యున్న సంత్యజించి
సత్వవేశమున నాశ్వాసింపుదురు శ్రుతి
                       స్వార్థమౌ ననుచు నాజనులు స్వాత్మ
సమశీలగురుముఖాబ్జంబులవలనఁ ద
                       చ్ఛుతిపరంపర బ్రహ్మరుద్రశుక్ర
వరుణాదిపరముగా వర్ణించఁ గని వార
                       లందఱుఁ గర్తవే యని తలంతు


తే. గీ.

[2]రంతరాత్మకు నెంచ నన్యామరత్వ
రూపములు వేఱుగా వని రూఢి మెఱయ
నాచరింతురు దేహాన్యమైన యాత్మ
దేహ మనిన తెఱంగునఁ దెలివి లేక.

74


చ.

ధరపయిఁ బౌండ్రకుం డనఁగఁ దామససాత్వికుఁడైన దైత్యశే
ఖరుఁడు ముముక్షుఁడై మహిమఁ గైకొని సత్వగుణోదయంబునన్
దిరుగుచు వాసుదేవపరదేవుఁడ వీ వవతార మంది భూ
భరణ మొనర్చినాఁడ వని బాలురు పల్కఁగ సమ్మతించినన్.

75
  1. నంద్రు
  2. అంత