పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/527

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వేదాంతరహస్యము

క.

పౌత్రుఁడవు పరాశరులకుఁ
బుత్రుండవు నాకవేదపుంజమవు దయా
పాత్రుఁడవు శక్తిసప్తవు
చిత్రితమే నీకుఁ బల్కఁ జెల్లదె యిచటన్.

62


మ.

అలఘుస్ఫూర్తి వశిష్ఠవంశనిధి వీ వాత్మానురూపంబుగాఁ
గళ లుప్పొంగఁగఁ బ్రశ్న చేసితివి సాక్ష్మాద్భహ్మవిద్యాసుధా
కలశాంభోనిధి వెల్లిగా సుతుఁడవై కైవల్యసీమావిశృం
ఖలసామ్రాజ్యవిభుండవై పలికిన[1]గావే మహాహృద్యముల్.

63


క.

నందనుఁ డెన్నఁడు నడుగఁడు
విందుండై నన్ను బ్రహ్మవిద్య యనుచు నే
సందేహింపఁగఁ బరమా .
నందం బొనరించితివి మనంబున కనఘా!

64


క.

భగవద్భక్తిపరాయణు
లగువారలు తండ్రికొడుకు లాత్మేశ్వరపా
ర్శ్వగులైన వారికంటెను
మిగులం బ్రియతములు గుణసమృద్ధి నుతించన్.

65


క.

శ్రుతు లన్నియును శిరస్స
మ్మితములుగాఁ జదివి ద్విజుఁడు మీమాంసాది
స్థితిచే శ్రీహరిఁ దెలిసిన
యతఁడు సుమీ తత్వవేది యనఁగ ధరిత్రిన్.

66


సీ.

సత్సర్వగసుఖవిజ్ఞానస్వరూపుని
                       సర్వసాక్షి నకల్మషప్రభావు
సతతచిదచిదాత్మసకలవస్తుశరీరు
                       నఖిలకర్మావబోధాధికారి
యోగ్యఫలప్రదు నుచితవాత్సల్య
                       జలధి శ్రీపతి సర్వశక్తి నతికృ
పాంబురాశిని మహోదారుని ననఘుని
                       సకలలోకారాధ్యచక్రహస్తు

  1. గాదే