పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/519

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


మొక్కటి యని యాగమోక్తుల నొకవంకఁ
                       బరమవిజ్ఞానులు ప్రస్తుతింపఁ
జిదచిచ్ఛరీరమై సిరుల రాణించు త
                       ద్బ్రహ్మము రూపింపఁ దద్బ్రహ్మమునకు


తే. గీ.

నాకృతియ లేదనుటకు యతో౽న్యధార్త
మను మహోక్తి నిషేధకం బయ్యెఁ బీన
వక్షుఁ డంచు మఱియు విశాలాక్షుఁ డంచు
శ్రీరఘూత్తము నాత్మఁ గీర్తించుకతన.

30


సీ.

బద్ధులైన నికృష్టభావులు సంసార
                       భాజనంబులు జగద్భర్తయేని
బద్ధుఁడైయుండినఁ బ్రభు వనిపించునే
                       బహువిధంబుల నెంచ బంధనార్హ
చోరుల విడిపించు పౌరుషం బొనరిన
                       వాడు ప్రభుండన వన్నె కెక్కుఁ
గాన నిబద్ధుండు గాఁ డెందుఁ బ్రభువు [1]
                       న్నిష్ఠుఁడై యున్నవానికి హితోప


తే. గీ.

దేశ మొనరింతు రార్యులు తేజ మిచ్చి
యంబుజాసను నిర్మించి యాగమములు
తెలిపె నేదేవుఁ డాత్మబుద్ధి ప్రసక్తి
యట్టిదేవునిఁ గొల్తు నే ననియె శ్రుతియు.

31


క.

సర్వవశగతుని దేవుని
సర్వాధిపు సర్వభూతసామ్రాజ్యనిధిన్
సర్వాంతర్యామిని హరి
సర్వజ్ఞుని నెఱిఁగి ముక్తిసంపద గాంచున్.

32


వ.

ఇందునకు “యో బ్రహ్మణా విదధాతి పూర” మ్మను నుపనిషద్వా
క్యంబు గలదు.

33
  1. కన్నిష్టు