పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/516

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


తెలియదు ధర్మసందేహ మిప్పుడు పుట్టి
                       న యది దానినడంచి నవ్యశక్తి
[1]తెలి పర్వనోదయాళులు గుణాఢ్యులు సర్వ
                       భూతసుహృత్పరాత్మాతినిశ్చ


తే. గీ.

లాంతరంగులు సర్వజ్ఞు లతులయశులు
రాజు నడచిన యట్లనె ప్రజలు నడుతు
రట్లు గావున ఘనులు మీ రల్పతరుఁడ
నైన వినిపింతుఁ దగు సత్ప్రియంబు సేయ.

22


తే. గీ.

అనుచు వైష్ణవదాసుండ నైన నాకుఁ
జిత్త మలరించి వాగ్రూపసేవ చేసి
పెద్దల నిరంతరంబు మెప్పింపఁగలిగె
భళిర నా కయ్యె జన్మసాఫల్య మిపుడు.

23


క.

భగవద్భక్తులకుఁ బ్రియం
బుగ సత్కర్మం బొనర్చు పురుషునిజన్మం
బగణితగుణసంపత్తిం
దగునండ్రు మదిం దలంచి తత్వజ్ఞుఁ డిలన్.

24


తే. గీ.

ఆత్మవేదులు కర్మ మర్హంబె సేయ
నంద్రు కొందఱు సూరు లయ్యాత్మవేదు
లైనవారికిఁ గర్మమర్హంబె సేయ
నంద్రు కొందఱు సూరు లత్యంతమహిమ.

25


క.

ఈయిరువురి వచనంబులు
నేయెడ నల్పులగు జనుల కెఱుఁగఁబడకయే
శ్రేయోమూలంబై య
త్యాయతమై ధర్మసంశయం బుదయించున్.

26

విష్ణుమహిమ

వ.

తత్సంశయవిషయద్రుమోన్మూలనమారుతంబగు నస్మదాచార్యో
పదిష్టనిశ్చయంబు విన్నవించెద. పరమాన పరజ్ఞాన పరానంద పర

  1. తెలివిపర్వనోదయాళులు గుణాఢ్యులు సర్వ (యతి, గణ భంగములు)