పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/515

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


తే. గీ.

పద్మభృంగత్వమా లేదు పరమనియతి
తత్వవిజ్ఞాపనైకకృత్యంబు నాకు
నిమ్మహాత్ముల కెఱఁగించు నిట్టి మహిమ
మద్గురుస్వామికృప నని మఱియు మ్రొక్కి.

16


వ.

ఇట్లనియె.

17


తే. గీ.

సర్వధర్మాదిహేతువౌ చక్రధరుఁడు
స్వామి విశ్వప్రపంచప్రశస్తజనులు
వాసు లీసభలోనఁ దద్దైవతత్వ
మెఱుఁగకుండిన నాపీఠ మెక్కఁగలనె.

18


క.

మానసమా వెఱవకు ముద
మానుము తద్బ్రహ్మపీఠి నాత్మేశేచ్ఛా
ధీనము లనన్యశేషము
లైన యవి సమస్తము లగు నావస్తుతతుల్.

19


ఆ. వె.

బ్రహ్మపీఠ మెక్కి ప్రాజ్ఞులముందఱ
గర్వరోగలిప్తగాత్రుఁ డగుచు
బ్రోడతనము చూపఁ [1]బూన నౌద్ధత్వమ
[2]యంద్రు తత్వవేదులైన మునులు.

20


వ.

అదిగాన తదౌద్ధత్యంబు భగవదనుగ్రహంబున మాకుం బ్రాపించదని
సన్మార్గరహస్యవేదియై యిట్లనియె.

21


సీ.

సత్క్రియావంతులు సకలాగమాంతపా
                       రగులు బ్రహ్మజ్ఞులు (న)గు మహాను
భావులు మీర లీప్రశ్నాంతరంబు మ
                       మ్మడుగుట విహితంబొ యవిహితంబొ

  1. బూను
  2. మంద్రు