పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/514

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


తే. గీ.

చంద్రుఁడవు నీవు చంద్రిక సరససూక్తి
సంతతి చకోరముల మేము సారసాక్ష!
సత్కరుణ జ్యోత్స్న నీవంటి సాత్వికప్ర
వర్తనుఁడు గల్గ నేర్చునే వన్నె మెఱసి.

11


క.

అల భగవంతుఁడు మాపైఁ
గలఁడని తలఁచితిమి యట్ల కాకున్నతఱిన్
గులవిద్యాసంపదలం
దలకొనదే గర్వమెల్లఁ దత్వజ్ఞనిధీ!

12


తే. గీ.

కలితవిద్యాకులధనోత్థగర్వపటల
జాతసంఛన్నదృష్ఠుల మైతిమేని
నిన్ను వీక్షింపఁగల మెట్లు నిఖిలధర్మ
పదవిశేషోపదేష్టవై పరఁగియున్న.

13


వ.

అనిన సూతుం డిట్లనియె.

14

సూతుఁడు బ్రహ్మజ్ఞానతత్త్వమును బోధించుట

మ.

కుల మాచారము విష్ణు(పాద)[1]భజనాం[2]కూరైకసద్భక్తి ని
శ్చలమౌ న్యాసలవంబు లేని యతినిస్సారాత్ముఁడన్ హీనదు
ష్కులుఁడన్ నేఁడు మఖంబునందుఁ బరిషద్గోష్ఠిన్ విజృంభించుటల్
గలదే మద్గురుశక్తి నట్టి గురులోకస్వామిఁ గీర్తించెదన్.

15


సీ.

జగతిపై బ్రహ్మనిష్ఠావిధి జ్ఞాత లె
                       [3]వ్వనిఁ జూచినను నిజేక్షణము ద్రిప్పి
జల మార్జనము చేసి చను దురాహీనుని
                       సాత్వికోత్తముఁ జేసి సకలమునులు
బ్రహ్మపీఠమునందుఁ బట్టము గట్టి రే
                       యాశ్రమంబునకైన నర్హవృత్తి
చాలదు విప్రవంశజుఁడఁగా నెన్నిక
                       విద్వాంసుఁడను గాను విష్ణుపాద

  1. అక్షరలోపము పూరింపఁబడినది.
  2. కూలైక. (మూ)
  3. ఎవ్వనిఁ జూచి నిజేక్షణములఁ ద్రిప్పి.... (మూ) ఇందు సీసపాదము పూర్తి
    కాలేదు. అంతేకాక ఆఱవగణము జగణమైనది.