పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/508

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


ప్రణాశని, సర్వలోకప్రదాయిని యనిన మోహిని వచనంబులు విని
శిరంబు లూఁచుచుఁ బరుషాక్షరంబుల నిట్లనిరి.

220


ఆ. వె.

అడుగరాని యర్థ మడిగితి వబల! సు
రాసురులకునైన ననుభవింప
రాదు విష్ణువాసరవ్రతఫలము నీ
కెవ్వఁ డొసగ శక్తుఁ డెంచి చూడ.

221


క.

హరిదివసఫలము దక్కన్
వరమొక్కటి వేఁడు మింక వారిజనయనా!
హరిదినము బ్రహ్మహత్యా
దురితాయుతకోటినేని త్రోవలఁ బెట్టున్.

222


వ.

సర్వయజ్ఞఫలప్రదంబగు హరివాసరఫలం బొసంగ మాకు శక్తి లే దది
మోక్షప్రదంబు, పుణ్యంబు, జన్మమృత్యునికర్తనంబు. తత్ఫలంబు
వేఁడిన నీశిరంబునఁ గులిశంబు వడియెడు ననిన మోహిని యిట్లనియె.

223


క.

అయిన న్నేమి? ప్రియంబుగ
దయతోడం బ్రాంతవిద్ధదశమీసుకృతం
బయిన న్నొసఁగుఁడు నాకని
లయులారా యనుచు సువికలంబుగఁ బలుకన్.

224


వ.

దివ్యు లిట్లనిరి.

225


ఆ. వె.

ప్రాంతవిద్ధదశమిఁ బ్రాపించు సుకృతంబు
హరునిమాటమీఁద నబ్జసూతి
జంభునకు నొసంగె సంతతబలశాలి
యైనఁ దత్ఫలమున కర్హుఁ డగునె!

226


వ.

అనిన మోహిని యిట్లనియె. దశమీప్రాంతంబున దివాకరుం
డుదయించినది మొదలు హరిదినం బది యసురులకు నొసంగిరి.
సూర్యోదయవిహీనంబైన దృశ్యాదృశ్యచరచరంబై దశమితోఁ గూడిన
హరిదినం బగ్నివిహారకాలార్హం బదియె వధూత్థాపన[1]కాలంబు,
గోదోహనకాలంబు, పక్షి నన్నాదలోలంబు, సర్వదేవవిరామ
కారణంబు, మార్జనిగ్రహణసమయంబు, ద్వారోద్ఘాటనవేళ, ప్రతి
వీక్షితస్నానావసరంబు, వాదిత్రనినదసంకులంబు, తద్దశమితో

  1. "మూలంబు” అని వ్రాతప్రతి