పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/507

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రాదు; భూతవ్రజాక్రాంతంబు గాని దు
                       స్థ్సాన మెయ్యది యది తలఁచి దీని
నునుపంగఁదగు భూమి నునిచెద ననినఁ జ
                       రాచరజీవసంవ్యాప్తతరము


తే. గీ.

దైత్యనాగాన్వితంబు పాతాళసీమ,
యాకసము పక్షులకునెల్ల నాకరంబు,
సుకృతి గమ్యంబు, నాకంబు వికృతిఁ బాప
కర్మనిలయంబు నరకంబు గణన సేయ.

216


వ.

ఝషాదులచే సాగరంబులు [1]వ్యాప్తంబు లయ్యెడి, విహంగంబులచే
మహీరుహంబు లధిష్ఠింపబడియె. ఇది యెచ్చట నుండెనేని దీని నంటిన
మాత్రంబున నధోగతిం బొందుదురు. అని విప్రుండు పలికిన నెఱింగి
యగుంకాక! యని మోహినిం జూచి నీకు లోకత్రయంబున నుండ
నవకాశంబు లేదు. దివ్యులు పాపభోక్తలు కారు; పాపసంగులుం గారు.
నీవు సేయు నుపకారంబులకు శాపాపాయవరంబు దయచేసెద మని
యున్నవార మిందులకు నుపాయంబు దోఁచ దనిన మోహిని
యిట్లనియె.

217


ఉ.

చేసితి మీర లంపిన యశేషవిశేషవిమోహకార్యముల్
వాసి ననేకపాపము లవార్యములైనను [2]ముట్టె నాత్మ ను
ల్లాసము నొందె దండధరు లక్ష్మి యశేషమనుష్యవర్గముల్
డాసె సమస్తఘోరవికటధ్వని నారకలోకవాసముల్.

218


తే. గీ.

చిత్రగుప్తుండు నలసెఁ జేసేత వ్రాసి
ధర్మసంచయ మెల్ల విధ్వస్తమయ్యె
నైనఁ బాపంబు నామీఁద నంట నిమ్ము
సంఘటించితి నే నిట్టి సాహసమ్ము.

219


వ.

అయినను బురోహితసహితులగు మీకు నంజలిఁ గావించి వేఁడెద.
మీకు హితంబు చేసి పాపంబు లనుభవించిన నేమి? మఱియుం దత్సాప
బుద్ధియే నాకుఁ దోఁచుచున్నది. ఏకాదశిపుణ్యఫలంబు నాకు నిడినఁ
దదాధారంబున నుండెద నయ్యేకాదశి సర్వదినపుణ్యరాశి, సర్వపాప

  1. "వ్యాపిషం బయ్యెడి" నని వ్రాతప్రతి
  2. "బుట్టి” వ్రాతప్రతి