పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/509

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


నేకాదశి కూడెనేని యది నాకు నివాసంబుగా నొసంగుఁడు
ఉదయంబున హరివాసరంబును వేఁడ వైనతేయోదయంబున వేఁడెద.
మునిదగ్ధ[1]నై యిష్ఠార్థంబుగా నీప్రాంతంబు వేఁడెద నీవలయు నిధి
యీకుండిన వేయితునియ లయ్యెదనని కులిశంబుచేత విచ్ఛిన్నయైన
తన్మోహిని పలుకు వచనంబులు విని దిగంబరపురోగములైన యా
నిర్జరులందఱు విమర్శించుకొని యమదర్శనార్థంబుగా, వైకుంఠధ్వంస
నార్థంబుగాఁ, బాషండవృద్ధ్యర్థంబుగాఁ, బాపసంజననార్థంబుగా,
దత్పురోహితునివలన ననుజ్ఞఁ గొని మోహినిం జూచి యిట్లనిరి.

227

దేవతలు మోహినికి స్థానమును కల్పించుట

సీ.

అఖిలలోకవిమోహానార్థంబుగా నీకు
                       నుండ నర్హం బగుచున్న ధామ
మాదశమీప్రాంత మదియె ప్రత్యూషదు
                       ష్టము హరిదినసంయుతము ఘటింప
జంభదుష్టము గాదు సకలదానవదైత్య
                       గమ్యంబు గాదు యోగ్యంబు గాదు
సురలకు, నందు సుస్థిరలీల విహరింపు
                       మాకాలమున మాధవార్చనంబు


తే. గీ.

సేయుమనుజుల సుకృతంబు చెందు నింక
సంశయం బంద నేటికి సారసాక్షి!
దేవకార్యార్థమై నీవు తిరిగినట్టి
తత్ప్రయాసంబు ఫలియించుఁ దరళనేత్ర!

228


క.

ఆదిత్యోదయహీనత .
నాదశమీప్రాంత మున్న హరిదివసముగా
నాదటఁ గైకొని యుండెడు
నాదుర్మదుఫలము నీకు నర్పించు నిఁకన్.

229


వ.

సూర్యహీనంబగు దశమీప్రాంతం బేకాదశీమిశ్రంబు నాశంబు
నొందించిన నుపవాసవ్రతదానజాగరణంబులచే నార్జించిన పుణ్యంబు

  1. "నైష్యర్థంబులుగా" నని వ్రాతప్రతి.