పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/490

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


సీ.

పతి నీకు వలసెనే భామిని ధనలోభ
                       పరత వంచించితి భర్త నిన్ను
దీనత వేఁడ నిందించి త్యజించి మీ
                       పుట్టినయింటికిఁ బోయి[1]నావ
నీవు చేసిన నిత్యనీచకృత్యంబులు
                       దలఁపవే చంచలత్వమున నబల!
శాశ్వతమే తండ్రిసంపద! మఱి భర్తృ
                       సంపద సతికి శాశ్వతము గాక


తే. గీ.

యధిపుకడ కెట్టు లేఁగెద వబల! లజ్జ
లేక భాషింప నోరాడు నీకు నెట్టు
లంగసంగంబు సుఖమె? దురాత్మ! నీవు
నాట నాడినమాట నానాఁట నరయ.

151


వ.

ఆతండు నిన్ను గృహంబుఁ జేరనిచ్చునే? లోకవాదభయంబునఁ
జొరనిచ్చిన శయ్యకుఁ జేరనిచ్చునే? శయ్యకుం జేరనిచ్చినఁ బశు
సంయోగంబునుంబోలె బలాత్కారరతం బగునని యాడిన నధోముఖినై
యశ్రువులు దొరుఁగ నీమణివలయం బేల యీనైతి? నీనూపురం బేల
యీనైతి? నీకటిసూత్రం బేల యీనైతి నయ్యో! యొకగవ్వయైన
నిచ్చిన మన్నించుఁగా! లోభంబుకంటె దుర్గుణంబు గలదే? యని
[2]తలంకుచు నతనిమొగం బెట్లు కాంతు నేమని భాషింతు? తలకుం
బాసిన వెండ్రుకం జేసి విడిచితి నింక నెడసిన చిత్తం బెట్లు హత్తునని
విచారించుచున్నసమయంబున.

152


సీ.

బంధువర్గంబు వెంబడిరా ననేకులు
                       వేత్రహస్తులు వృద్ధవిప్రజనులు
చామరవ్యజనవీజనపరుల్ నలువంక
                       సవడిఁ గొల్వఁగ సితచ్ఛత్రరాజ
మూనిపట్టఁగ భూషణోత్కరపేటికఁ
                       గొని యొకసైరంధ్రి మొనసి నడువ
రమణీయకాంచనరత్నడోలికఁ దెచ్చి
                       జంఘాలవర్యు లాశ్చర్యశక్తిఁ

  1. "నాఁడ" వ్రాతప్రతి
  2. "తలంగుచు" వ్రాతప్రతి