పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/480

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


తే. గీ.

సత్యకులశీలవేదశాస్త్రప్రసంగ
వరవధూసంగభంగనిర్భరతరాంత
రంగుఁడగు తద్వరున కిచ్చి[1] రతులనియతి
సమవివాహం బటంచు భూజనులు పొగడ.

112


క.

మామామ యిచ్చె వరము
క్తామణిహేమాయుతములు తతవైభవల
క్ష్మీమహనీయోత్సవమున
నామేరనె యిచ్చెఁ దండ్రి యతిమోహమునన్.

113


వ.

ఇట్లు పితృశ్వశురదత్తవిత్తశ్రీప్రమత్తనై యుండ నంతఁ గొంత
కాలంబునకు నాయత్తమామలు నాకలోకంబునకు నేగి రంతం
బ్రబుద్ధుండై మద్భర్త మాసద్వయంబు గడచిన రాజమందిరంబునకు
నేఁగి మరలివచ్చుచు రూపలావణ్యవిలాసవిభ్రమంబులుగల వేశ్యలం
జూచి వారలలోన సౌందర్యనిధి యగు నొక్కర్తు నింటికిం దెచ్చు
కొని దానితో రమింపుచు విత్తంబుఁ గోలుపోయె. వర్షత్రయంబునకు
జూదంబాడి నిలస్స్వుండై మధ్భూషణంబులు వేఁడిన నొసంగక పితృ
గృహంబునకు నేగితి నంత గృహంబు విక్రయించె నంత నల్ప
మూల్యంబునకుఁ జేను దొడ్డి తోఁట మంద మొదలు సర్వంబును నమ్మి
కొనియె నంత నోడ యెక్కి సముద్రతరణంబు చేసి దూరంబునకు
నేఁగ వాయువశంబున నాయోడ యామారంబునఁ బడి యేడుయోజ
నంబులు మించి చనియె నందునున్న నావికులు క్షుత్పిపాసార్దితులై
పరాసులైరి. విత్తంబంతయు విడిచి దైవయోగంబున నడవి చేరి
నిషాదులుం దాను నోడ విడిచి బహుశృంగవిభూషితంబై బహువృక్ష
సమాకీర్ణంబై బహుపుణ్యఫలాన్వితంబై యంబరచుంబిశిఖరంబగు
నొక్కనగంబుఁ జేరి భక్షణంబు వెదకుచు.

114


తే. గీ.

అచట నొకద్రాక్ష చూచి జరామరణ[2]వి
నాశనములగు ఫలములు నవ్యమధుర
రసము లొలుకంగ భక్షించె రమ్యరుచులు
దనర నిరువదియాఱింటిదనుక నతఁడు.

115
  1. అఖండయతి
  2. “కనాశనములకు ఫల" వ్రాతప్రతి.