పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/479

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


తే. గీ.

భర్త దుఃఖోపలబ్ధిమైఁ బరితపింపఁ
జేయునింతి యధోగతిఁ జెంది జన్మ
సప్తతిం బూ[1]యు నిరయాప్తి సడలి మూఁడు
నమలు విముఖిక్రిమికుయోని జని వహించు.

109


క.

ధనమేని ప్రాణమేని వి
భున కడిగినయపుడె యీక పూనికతో నుం
డిన సతి విష్ఠాక్రిమియై
ఘనదైన్యముతోడ నింతికాష్ఠిలయు నగున్.

110

కాష్ఠకీటవృత్తాంతము

వ.

ఏను బాల్యంబున సఖీజనంబుతోడన్ మత్పితృమహాననశాలం గోష్ఠ
[2]పాలనపరుండగు పాచకుండు కాష్ఠదళనం బొనర్పఁ దత్కాష్ఠ
మధ్యంబుననుండి నవనీతశుభాకారయు, నంజననిభాననయుఁ
గనిష్ఠికాప్రమాణయుఁ ద్వఙ్మాంససమావృతయునైన యొకకాష్ఠిల
మెదలిన దాని భక్షింప నొకవాయసంబు చంచుపుటంబునం బొడుచు
నంత నే నొకకాష్ఠంబున నదలించిన వాయసంబు విడిచి చనియె.
అప్పు డాకాష్ఠిల మనుష్యభాషల నిట్లనియె.

111

సుప్రియ యను స్త్రీచరిత్రము

సీ.

వినుము సంధ్యావళి మును దురితం బొన
                       ర్చినదానఁ గౌండిన్యుఁ డనఁగ నొక్క
బ్రాహ్మణోత్తముఁడు శోభనధర్మశీలుండు
                       గలఁడు కన్యాకుబ్జకలితయశుఁడు
తత్త్వజ్ఞుఁడైన యాతనిభార్య నేను సు
                       ప్రియ యనుదాన నో భీరుమధ్య!
తల్లిదండ్రులును బాంధవసమూహంబు న
                       న్నల్లారుముద్దుగా నాచరించి

  1. "య" వ్రాతప్రతి
  2. "పాట" వ్రాతప్రతి