పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/473

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ధర్మాంగదుఁడు మోహిని ననునయించుట

క.

రా జేమి చేసె నీ కం
భోజానన రాజు నింద నొందించెద వ
య్యో! జనని! తగునె నీ కీ
యోజన నిఖిలావనీసురోత్తమసభలన్.

73


వ.

అనిన మోహిని యిట్లనియె.

74


మ.

అరుణాశోకసమాకృతి న్మెఱసి చక్రాబ్జధ్వజచ్ఛత్రచా
మరమీనాంకుశముఖ్యరేఖలను రమ్యంబై సువర్ణాంగద
స్ఫురితంబై తగునట్టి దక్షిణకరాంభోజంబుపైఁ జూచి యీ
ధరణీనాథుఁడు సత్యశీలుఁ డనఁగాఁ దప్పెం గుమారోత్తమా!

75


క.

అది గాన సకలభోగా
స్పదమగు మజ్జనకు రాజ్యపదమున కే నేఁ
గెదఁ; ద్రిదశేంద్రాదుల నా
మది మెచ్చక వలచి వచ్చి మఱి యిట్లయితిన్.

76


వ.

అన ధర్మాంగదుం డిట్లనియె.

77


క.

దేవీ! నీయానతి నేఁ
గావించెద నెద్దియైనఁ గటకట! శోకం
బీ వింత చెంద నేటికి ?
వేవేగ నృపాలుకడకు విచ్చేయు మిఁకన్.

78


[1](వ.

అనిన మోహిని యాతని కిట్లనియె.)

79)


సీ.

తనయ! మీతండ్రి మందరగిరిక్షోణి ధూ
                       ర్జటి సన్నిధానదేశంబునందు
భార్యగా ననుఁ జెంది బహుభాషయై పల్కి
                       బొంకెఁ గాంచనవస్త్రభూషణాంబ
రగ్రామఖేటఖర్వటగజహయముఖా
                       ఖిలవస్తువులు వేఁడఁదలచఁ దనకు
హాని యౌననుచు మోహము గల్గి దేహ మే
                       రీతిని బలశక్తి హెచ్చియుండు

  1. ఈవచనము వ్రాతప్రతియందు లేదు. గ్రంథపాతపుగుర్తులును లేవు. అయినను సందర్భము జూచిన నిది యవసరమని స్పష్టపడగలదు.