పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/470

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


చ.

శపథముఁ జేసినాఁడవు, ప్రశస్తిని శ్రీహరివాసరవ్రత
ప్రపదనవృత్తిమై నుభయపక్షములన్ నిజబుద్ధిచేతనే
సృపవర! శాస్త్రదృష్టిని వినిర్ణయమై తగియుండు నాగృహ
స్థపతులు సాగ్నులై యుభయసమ్మతపక్షములన్ భుజింపరే?

59


వ.

అది గాన వర్ణత్రయంబును హోమోచ్ఛిష్టభోక్తలు గావలయు. విశే
షించియు నిరంత[1]రోద్యతాయుధులైన రాజులకు నుపవాసంబు
యుక్తంబుగాదు. శాస్త్రంబేని యశాస్త్రంబేని నీవు చేసిన శవథం బస్మ
దనుగ్రహంబునఁ బూర్ణంబయ్యెడు. వ్రతభంగదోషంబు నీకు లేదు.
విప్రసమన్వితుండవై భుజింపు. విప్రవాక్యంబు మహత్తరంబు. తద్వా
క్యోల్లంఘనంబు చేసినఁ బదియేనుజన్మంబులు రాసభయోనిన్
జన్మించునన రాజు వారలం జూచి యిట్లనియె.

60


సీ.

సర్వభూతములకు సన్మార్గవర్తులై
                       యకట! విమార్గస్థు లగుట దగునె?
యతులకు విధవల కర్హంబు హరివాస
                       రోపవాసంబన నుచిత మగునె?
యదియ మిథ్యావాక్య; మఖిలభూతములకు
                       హరివాసరవ్రతం బాచరింప
నియతంబు; రాజులు నిక్కం బుపవసిం
                       పఁగఁ దగుఁ; బౌరాణభవ్యగాథ


తే. గీ.

సంశయంబెల్లఁ దీర్చెడు: శంఖమునను
జలముఁ గ్రోలుట, కిటికూర్మపలలభక్ష
ణంబు సేయుట హరివాసరంబునందు
నుభయపక్షమ్ముల భుజింప నొప్పదనుచు.

61


క.

వలదు సురాపానము వి
ప్రులఁ జంపఁగవలదు ద్యూతముల వర్తింపన్
వలదు హరివాసరంబున
వలదు భుజింపంగఁ బాపవర్తను లయినన్.

62
  1. "రోద్యాయుధు" అని వ్రాతప్రతి