పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వాడవై కీర్తి పొందుదువుగాక" అని శపించి అనుగ్రహిస్తాడు. అప్పుడు నారదుడు బాధపడి మహోగ్రుడై "నీకు పూజాకవచాదులు దేవాలయాలు లేకుండా పోవుగాక" అని బ్రహ్మకు ప్రతిశాపం యిచ్చాడు. ఈవిషయాలు బ్రహ్మవైవర్తపురాణం వల్ల అవగత మవుతున్నాయి. ఈ కథలు వాస్తవాలు అనుకున్నా అవాస్తవికాలనుకున్నా అటు శాస్త్రపురాణాదుల్లో కాని ఇటు లోకంలో కాని బ్రహ్మకు సంబంధించిన అర్చనాదివిషయాలు లేకపోవడం, దేవాలయాలూ విగ్రహపూజలూ లేకపోవడం అనేక శతసహస్ర అబ్దాలుగా మనకు ప్రత్యక్షంగా కనిపిస్తున్నది.

అద్భుతరామాయణాన్ని పరిశీలిస్తే నారదుడు లక్ష్మిని రాక్షసగర్భంలో జన్మించవలసిందని రాక్షసులవల్ల కష్టాలు పొందవలసిందని శపించినట్లు కనిపిస్తున్నది. ఈశాపానికి మూలభూతమైన విషయం యిది.

కౌశికుడు ఒకరోజున స్వర్గంలో గానంచేస్తుండగా లక్ష్మీ ఆమె పరిచారకులూ, మునులూ నారదుడు మొదలైనవారుకూడా వింటున్నారు. అప్పుడు పరిచారకులు ఋషులను దూరంగా తొలగిఉండుండని బెత్తాలు పుచ్చుకొని వారిని దూరంచేశారు. లక్ష్మి తుంబురునిపట్ల ఒకానొకవిశిష్టమైన అభిమానం కలిగినదవడంవల్ల కౌశికునితో కలిసి గానం చేయవలసిందిగా కోరి తుంబురునికి పారితోషికం యిచ్చింది. అది నారదుడు అవమానంగా భావించి లక్ష్మిని రాక్షసగర్భంలో జనించవలసిందిగా శపించి రాక్షసులవల్ల ఇదేవిధంగా శిక్షింపబడుదువుగాక అని కూడా శపించాడు.

అప్పుడు విష్ణువు నారదుణ్ణి ఊరడించి "భక్తిగానం చెయ్యడం రూపంగా తుంబురునికి మహాగానప్రభావం లభ్యమయింది. నీకు కూడా అటువంటి ఉత్తమగానం లభించాలంటే మానసోత్తపర్వతం మీద "గానబంధువు" అనే గూబ ఉన్నది. దాని దగ్గరకు వెళ్ళి గానాభ్యాసం చేయవలసింది"గా సలహా యిచ్చాడు. అప్పుడు నారదుడు అక్కడకు వెళ్ళి గానబంధువు వల్ల సుశిక్షిత పొంది తిరిగి తుంబురునివద్దకు వచ్చి గానవిషయంలో తుంబురునితో సమానత్వాన్ని సాధించలేక అతనిమీద అసూయపడి తిరిగి శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళాడు. తనకు తుంబురుని గానసామర్ధ్యాన్ని మించగల గానాన్ని అనుగ్రహించవలసిందిగా కోరాడు. అప్పుడు శ్రీమహావిష్ణువు నేను శ్రీకృష్ణుడుగా జనించినప్పుడు నీకు గానం నేర్పుతానని మాట యిచ్చాడు. శ్రీకృష్టావతారకాలంలో గతంలో యిచ్చిన మాటప్రకారం నాకు గానాన్ని నేర్పవలసిందిగా శ్రీకృష్ణుణ్ని కోరాడు. అప్పుడు శ్రీకృష్ణుడు మొదట జాంబవతివద్ద తరువాత శ్రీకృష్ణుని భార్యలవద్ద ఒక్కొక్కభార్యవద్ద ఒక్కొక్కసంవత్సరం వంతున గానం నేర్చుకోవలసిందిగా చెప్పాడు. ఆ ప్రకారం చేసినా నారదుడు సంపూర్ణగానకౌశలం సంపాదించలేనందువల్ల చివరికి శ్రీకృష్ణునివద్ద