పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శాపం యిచ్చాడు. అనంతరం నారదుడు సృంజయరాజు నడిగి తనహృదయంలోని విషయం చెప్పి సుకుమారిని వివాహం చేసుకున్నాడు. కొంతకాలం తరువాత నారదుడూ పర్వతుడూ కలుసుకున్నారు. గతాన్ని ఆలోచించుకుని వారిద్దరూ పరస్పరశాపవిమోచనం చేసుకున్నారు. శాపవిమోచన అనంతరం అంతకు పూర్వం వానరముఖంగా ఉన్న నారదముఖం మారిపోయి అసలు పూర్వరూపం వచ్చినందువల్ల సుకుమారి అతన్ని గుర్తించలేక తన భర్త అయిన నారదుడు కాడని అనుకున్నది. అప్పుడు పర్వతుడు అతడు అసలు నారదుడేనని జరిగినవిషయమంతా తేటతెల్లం చేశాడు." అని మహాభారతంవల్ల తెలుస్తున్నది.

గతంలో ఒక సందర్భంలో శ్రీమహావిష్ణువు ఒక్కడే జగన్నాటకసూత్రధారి కాడని నారదమహర్షికూడా జగన్నాటకసూత్రధారి పదానికి సమర్హుడే నని పేర్కొనడం జరిగింది. ఈ మాట ఊరికే అనలేదు. నారదుడు యెన్నెన్నివిచిత్రాలు నడిపాడో శిష్టరక్షణార్థం దుష్టశిక్షణార్థం యెటువంటి మహత్తరసూత్రధారిగా వ్యవహరించాడో గతంలో గుర్తించాం. అక్కడితో నారదుని మహత్తరశక్తి ఆగలేదు. నారదుడు బ్రహ్మదేవుణ్ణి, లక్ష్మీమాతను చివరికి ఆజగన్నాటకసూత్రధారియైన శ్రీ మహావిష్ణువునుసైతం అతని భక్తుడై ఉండికూడా శాపగ్రస్తులను చెయ్యడం జరిగింది.

దక్షప్రజాపతి కుమారులు తండ్రి ఆజ్ఞ ప్రకారం సృష్టి కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు. ఇంతలో నారదుడు వారివద్దకు వెళ్ళి "మీరు ముక్తిసాధనగురించి ఆలోచించక ఈ సాంసారికలంపటంలో పడి కొట్టుకుంటా రేమిటి" అని బోధ చేసి వారు సృష్టికార్యక్రమాన్ని నిర్వర్తించకుండా ఆపివేయించాడు. తనపుత్రుల సృష్టికార్యక్రమానికి నారదుని వల్ల భంగం యేర్పడిందని దక్షునకు తెలిసి అతను బ్రహ్మవద్దకు వెళ్ళి ఆవిషయాన్ని తెలియజేశాడు. అప్పుడు బ్రహ్మ నారదుణ్ని దక్షపుత్రికకు నీవు సంతానంగా సంజనితుడవవుదువుగాక" అని శపిస్తాడు. అంతేకాదు దక్షుడుకూడా ఆగ్రహం పట్టలేక "నారదునికి యెక్కడా నిలకడ అనేదే లేకుండా పోవుగాక అతడు సంసారి అయినప్పటికీ సృష్టికార్యక్రమానికి భంగం కలిగించాడు కాబట్టి అతడు అనపత్యుడవుగాక" అని శపిస్తాడు.

సృష్టిని అభివృద్ధి చెయ్యవలసిందిగా నారదుడిని బ్రహ్మఒకసారి కోరతాడు. కాని నారదుడు "నేను సంసారసాగరనిమగ్నుడనై ఉండలేను. నాకు మోహబంధనాలతో పనిలేదు. నేను సృష్టికార్యక్రమాన్ని నిర్వర్తించలేను" అని తిరస్కరిస్తాడు. అప్పుడు బ్రహ్మ ఆగ్రహోదగ్రుడై "నీవు మహాకాముకుడవై స్త్రీలోలుడవై శూద్రయోనిలో జన్మించుదువుగాక. అనంతరం బ్రాహ్మణసంపర్కంతో విష్ణుభక్తి కల