పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/463

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


తే. గీ.

ప్రాతిసాంవత్సరికముఖ్యపైతృకములు
తర్పణాదికములుఁ బిండదానములు [1]
యావ్రజనములు సేయక హరిదినమునఁ
దనయు లుపవాస ముండినతఱిని జగతి.

26


వ.

తత్పితృగణంబు మోక్షంబు నొందు ననుచుం" [2]జాటి.

27

ప్రబోధనీమహిమ

క.

"అక్లేశకరము కార్తిక
శుక్లైకాదశి యముండు చూడ వెఱచు రో
షక్లిన్నాక్షుండై హరి
[3]విక్లబులను గావఁగాఁ దవిలి మేల్కనఁగన్.

28


తే. గీ.

బ్రహ్మహత్యాదిదుస్తరపాతకములు
కామచారకృతంబులై కలిగిన యవి
యెన విలయంబు నొందు నన్యూనమహిమ
నిది ప్రబోధని యండ్రు యతీంద్రవరులు.

29


క.

ఘనపాతకములు వాయఁగ
ననిశము ధర్మంబె నిల్పి హరికిఁ బ్రబోధం
బొనరింప నిది ప్రబోధని
యని పలికిరి సూరిజనము లాయాసభలన్.

30


క.

ఒకనాఁడైనఁ బ్రబోధని
నకలంకత నుపవసించు నాతఁడు చన్బా
లకు లోను గాఁడు రవిబా
లకునకు మఱి లోను గాఁడు లలితస్ఫూర్తిన్.

31


చ.

మలయజచంద్రకుంకుమ సమగ్రముగాఁ గలపంబు లందుఁ డు
జ్జ్వలత దుకూలచేలము విశాలముగా సవరింపుఁ డుత్తమా
ఖిలమణిభూషణాళి బెళఁకింపుఁడు ఫుల్లసుగంధపుష్పజా
తులఁ పలుపూజ సేయుఁడు యదుప్రవరోత్తముఁ బార వీథులన్.

32
  1. గయావర్జన మనుట సంప్రదాయము. వజ్రనము=వెళ్లుట అనువిధముగా నెట్లో సమన్వయము కుదుర్చుకొనవలెను.
  2. "జాటి రతివ వినుము" అని వ్రాతప్రతి
  3. "విక్షంబులు గావఁ గావ వివి మేల్కనఁగన్" అని వ్రాతప్రతి