పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/462

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


చ.

అతులపరాక్రమోన్నతుఁడ వంచు గుణాఢ్యుఁడ వంచు వైభవ
స్థితి గలవాఁడ వంచు నరసిద్ధనభశ్చరసాధ్యనాగయ
క్షతురగవక్త్రదానవముఖప్రకరంబుల నీసడించి వ
చ్చితి నినుఁ గోరి మంథనగసీమకుఁ బ్రేమకు మేర యున్నదే!

22


తే. గీ.

మనసు మనసును గలిసి ప్రేమలత ననలు
గలుగ దంపతులకు నవి కామఫలము
లన్యచిత్తత్వముననైన యట్టి కామ
మరయ శవసంగమోపమ మనిరి బుధులు.

23


తే. గీ.

రూపసౌందర్యశీలముల్ రూఢి కెక్క
నీవు పతి వైనకతమున నెందు నాకు
దుర్లభమె మూఁడుజగములందుం గలిగిన
వైభవస్ఫూర్తి యైన నో వసుమతీశ!

24


తే. గీ.

కామినీకుచకుంభము ల్కాముకుల కు
రంబునం దొకమేరువై ప్రబలుఁ గాదె
యమృత మనఁగఁ బురంధ్రివరాధ[1]రోష్ఠ
వరసుధారయ కాదె! భూవరవరేణ్య!

25


సీ.

[2]కుచకుంభముల నానికొని [3]వీఁపు గీలింప
                       మత్తకుంభీశకుంభస్థలోరు
పటహరవాధికోద్భటభటార్భటి దోఁచెః
                       "హరిదినం బెల్లి మీరతులనిష్ఠ
నక్షారలవణమై యమరు హవిష్యాన్న
                       మొక్కప్రొ ద్దొనరించి యువతిఁ బాసి
యవనితల్పమున మురారిపాదాబ్జముల్
                       దలఁపు చనన్యచింతత వహించి

  1. "రాసు" వ్రాతప్రతి
  2. 25, 26 పద్యములనడుమ "అని పలికి" అను విధముగా నొకచిన్నవచన ముండవలెను. లేనిచో నన్వయము కుదురదు.
  3. "నీవు" అని వ్రాతప్రతి. దానికి సమన్వయము లేదు.