పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/461

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


చ.

పనిచిన వచ్చి రత్నగృహపాలిక బాలిక లూఁచ డోలికాం
చనమున మోహినీ[1]లకుచచారుకుచస్థలవర్తియై యశో
ధనుఁడగు ధర్మశోధనునుదారకళాపరిపూర్ణ చంద్రునిన్
గనుఁగొని వామభాగమున గ్రక్కున నిల్చె వరాంజలిక్రియన్.

15


వ.

నిల్చి యిట్లనియె.

16


మ.

ననుఁ బిల్పించితి వేమి నాథ! సకలానందంబులం దావకో
క్తిని దేశంబుల నున్నదానను సపత్నీదుఃఖలేశంబు లే
దనఘా! మోహిని నాశరీరము తదీయంబైన భోగంబు మ
ద్ఘనభోగం బిఁక సంశయంబు గలదే కారుణ్యరత్నాకరా!

17


తే. గీ.

పతిసుఖం బాత్మసుఖమని భక్తిఁబూని
తలఁచని యసాధ్వి శ్యేనియై ధరణిఁ బుట్టు
నయిదు మూఁడునునైన జన్మాంతరములఁ
గాన [2]నానతి యొసఁగు మే కార్యమైన.

18


వ.

అనినఁ గులశీలజన్మాద్యభిమానంబులు గలదానవని బహూకరించి
కార్తికమాసవ్రతంబు లెన్నేనియుం గడచె నీమోహినితో రమింపఁగ
మదాంధుఁడనై యుంటి. ఇంకనేనియు నీవ్రతంబుఁ జేనెదనన్న
మోహిని వారింపుచున్నది యనఁ దా నొనర్చెదనని యంగీకరించి వర
కృఛ్రసంజ్ఞంబైన వ్రతంబుఁ బూనె. రుక్మాంగదుండు నంత కుశ
కేశిపుత్రిం జూచి యిట్లనియె.

19


తే. గీ.

ఇంతి నీమాట చేసితి నింతనుండి
సకలభోగానుభవమహైశ్వర్యధుర్య
పూర్ణకామత నుండు మే పొలఁతిమీఁద
నైన నీమీఁదఁగల ప్రేమ పూనఁ[3]గలనే?

20


వ.

అనిన మోహిని యిట్లనియె.

21
  1. "వికుచశాలి కుశస్తవివర్తియై" అని వ్రాతప్రతి పాఠము.
  2. "యానతి". అని వ్రాతప్రతిలో దిద్దుబాటు.
  3. "గలదే” వాతప్రతి