పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/460

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


వ.

ఆపణపరిత్యాగంబున ధేనుదానంబును నామిషత్యాగంబునఁ గపిలా
దానంబును దేవతాలయంబున నిత్యదీపం బర్పించిన సఘృతవాసో౽
న్వితతామ్రకాంచనదీపపాత్రంబులు విష్ణుభక్తునకు వ్రతపూర్తికి
నర్పించిన నైశ్వర్యంబు ప్రాపించు. ఏకాంతోపవాసంబున వస్త్రకాంచన
యుక్తంబులైన యెనిమిదిహలంబులు శయ్యతోఁగూడ నొసంగందగు.
త్రిరాత్రోపవాసంబు చేసిన ఛత్రోపానహయుతమైన మణిక మర్పించి
శిరాకర్షణక్షేమంబైన పచ్చని యనడ్వాహంబు నర్పింపవలయు.
నేకాహ్నికోపవాసంబున నజాదానంబు సేయవలయు. ఫలాహారంబు
చేసిన శాలిదానంబు గావింపవలయు శాకాహారంబు చేసిన ఘృతపూర్ణ
రజతపాత్రంబు లర్పింపవలయు నివి యిన్నియు లభింపకున్న విప్ర
వాక్యంబున వ్రతంబు పూర్ణంబు గావింపవలయు. విప్రవచనంబు
గ్రహించి దక్షిణ యొసంగఁడేని నరకంబునం బడు. వ్రతవైకల్యం
బునఁ గుష్ఠియు నంధుండు నగు. దివిజులు బ్రాహ్మణవాక్యంబు
నందే వర్తింపుదురు. తద్వాక్యంబు శ్రేయఃకాంక్షియగువాఁ డెవ్వఁ
డతిక్రమించు? వేదాశ్రితమై పాపవిమోచనంబై మాధువతుష్టిహేతు
వైన పరమరహస్యంబు విను మనిన మోహిని యిట్లనియె.

10

మోహిని రుక్మాంగదుని వ్రతనిష్ఠ మాన్పించుట

మ.

ఇతరం బెంచక కార్తికవ్రతము లోకేష్టంబు గావించి ప
ల్కితి రాజుల్ వ్రతదీక్ష గైకొనుట [1]లక్ష్మీహేతువే? యుద్ధరం
గతరంగస్ఫురితాంతరంగజయవిఖ్యాతిన్ మహీపాలన
వ్రతముం దానముఁ దక్కఁ జేయుదురె పూర్వక్షోణిఫాలాగ్రణీ!

11


క.

చేయకు మీవ్రత మవనీ
నాయక! కందర్పమోహనశితాస్త్రము నా
కాయము నాటినఁ దూలెన్
గాయము కానంగరాదె [2]గాయము లింకన్.

12


వ.

అనిన.

13


క.

ప్రతివచనము దోఁచక భూ
పతి యతివిస్మయము గాంచి ప్రఖ్యాతగుణ
స్థితి సంధ్యావళిఁ బిలువన్
వితతమహోపాయలైన వెలఁదులఁ బంచెన్.

14
  1. "లక్ష్మీహేతువై " యని వ్రాతప్రతిలో దిద్దుబాటు కలదు.
  2. "కాయము లింకన్" అని వ్రాతప్రతి.