పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/457

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


శా.

సత్యారామ[1]తటాధిరోపితసుమాంచత్పారిజాతద్రుమా!
యత్యైశ్వర్యవిశేషపూరితకుచేలాఖ్యాక! పాంచాలికా
సత్యార్తిక్షపణప్రసన్నవిమలస్వాంతా! భజల్లోకసం
పత్యుల్లాసవికాసదాయికరుణాంభఃపూర! భోజ్యాధిపా!

352


క.

ఘంటాకర్ణమనోరథ
ఘంటాపదశీల! బాణకలుషాత్మకదో
ర్లుంటాక! వక్రిమాఖ్య[2]చి
రంటీసౌశీల్యకల్యరక్షోరునిధీ!

353


మహాస్రగ్ధర.

[3]కకుబంతాఖ్యాకరుగ్ముక్కకుదవరశుభాకారరేఖావిధానా
ధికసౌరభ్యప్రసాదా! స్థిరవిభవఘనోదీర్ణతేజఃప్రభావా!
[4]ప్రకటస్వాంతస్థలోకప్రచయసకలసంపత్ప్రకాశాతి[5]హర్షో
త్సుకసచ్ఛ్రీహృద్యశోదాస్తుతచరిత! సుధాంధోజనస్తోత్రపాత్రా!

354

గద్యము
ఇది శ్రీమత్కంజర్ల కొండమాచార్య
పాదారవిందమిళిందాయమాన చెన్నయామాత్యపుత్ర
కశ్యపగోత్రపవిత్ర శ్రీమదల్లాడు నృసింహప్రణీతంబైన
నారదీయపురాణంబునందుఁ జతుర్థాశ్వానము
సంపూర్ణము

  1. తటాదిరోపిత
  2. చిరంటాసౌశీల్యకల్యసౌభాగ్యనిధీ!
  3. కకుబంతాఖ్యాక యుగ్మక్కకుభతర శుభాకార
  4. ప్రకటస్యాంతశ్యలోక
  5. హర్షోత్సుకసన్మునిహృద్యశోదా