పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/456

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


జాగరం బొనరించి సకలపురాణసం
                       శ్రవణంబు గావించి చక్రిఁ గొల్చి
యారాత్రి దాఁటించె నతిపాతకుండేని
                       హరిలోకమున కేఁగు నతిశయమున


తే. గీ.

రమణిగర్భంబు చొరఁడు వరాహమండ
లంబు తత్కాలమునఁ గుశలమతిఁ జూడ
సా(౦)ఖ్యయోగప్రభావప్రసక్తిఁ బాసి
యనఘనిర్వాణసంపద యాక్రమించు.

350


వ.

కార్తికంబున సూకరమండలంబు చూచి త్రివిధపాతకంబులఁ బాసి
పునర్జన్మంబు నొందండు. కార్తికంబునఁ దైలక్షౌద్రంబులు వర్జింప
వలయు. [1]కాంస్యపాత్రంబున భుజింపందగదు. నిష్వావభక్ష
ణంబు చేసి సంవత్సరకృతపుణ్యంబులం బాసి [2]రాసభియోనిం
బంచదశజన్మంబులు జన్మించు. కార్తిక[3]మాసంబున సూకర
మాంసంబు భుజించిన దుర్మతి షష్టివర్షసహస్రంబులు రౌరవంబునం
బడు. నారౌరవంబులం బాసి గ్రామసూకరంబై జనియించు.
కార్తికంబున మత్స్యభక్షణంబు సేయునతండు చండాలుండై జని
యించు. కించిద్వ్రతాచరణంబు చేయువానికినేనిం గార్తికంబున
సకలపాపంబులు నడంగు. కార్తికంబున వ్రతదీక్షఁ గైకొనండేని
సర్వపుణ్యంబులు నిరర్థకంబులగు. పశుయోనియందు జనియించి
మఱియుఁ గ్రిమికీటకాళియందు నుద్భవించు. కార్తికంబు వచ్చిన
గృహంబున వర్తింపందగదు. విశేషించి కార్తికి గృహంబునఁ జేయం
జనదు. తీర్థాంతరంబునకుం జనవలయు. కార్తీకశుక్లపక్షైకాదశి
నుపవసించి ద్వాదశిప్రాతఃకాలంబున శుభకర్మంబు లాచరించినవానికి
హరిమందిరసీమ లభించు. సంవత్సరవ్రతసమాప్తియుం జాతు
ర్మాస్యవ్రతసమాప్తియుం గార్తికంబునం జేయవలయు. కార్తికంబునఁ
బదిదినంబులు విష్ణునాభిసరోరుహం బని వెలయు; నాదినంబుల
యందు నుత్తరాయణంబు గాకయున్న శుద్దలగ్నంబు లేకయున్న
వివాహంబు లొనర్చినఁ బుత్రపౌత్రాభివృద్ధి యగుఁ గానఁ గార్తిక
వ్రతంబు సలుపవలయు ననిన మోహిని యిట్లనియె.

351
  1. కాంస్యపాత్రంబున భంజింపందగదు
  2. రాసభిర్యోనిం
  3. మాంసంబున