పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/455

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


క.

క్షితిఁ గార్తికమాసం బ
చ్యుతనాభిసరోరుహంబు నూరిజనం బ
చ్యుతపూజ సేయునాతఁడు
శతజన్మాఘములఁ బాయు శౌరిం జెందున్.

344


గీ.

వసుధలో వ్రతోపవాసనియమములు
కార్తికంబునందుఁ గడపెనేని
వాఁడు దివ్యశక్తివైమానికుండయి
తిరుగుచుండు విష్ణుదేశమునను.

345


వ.

అది గావున నాపై మోహంబు వదలి హరిపూజాపరత్వంబున వర్తింపు
నేను వ్రతపరుండ నయ్యెద ననిన మోహిని యిట్లనియె.

346


ఉ.

కార్తికమాస ముత్తమముగా నిటు పల్కితి విస్తరంబుతో
నార్తిహరంబుగాఁ దెలుపు మభ్రధునీకిటిధామపుష్కరా
వర్తములందుఁ జేసెద నవశ్యము దానిమహత్త్వ ముర్విపై
వార్తగఁ దద్వ్రతంబు మునివర్యులకెల్లఁ బ్రకాశమై తగన్.

347


వ.

[1](అనిన మోహినికి రా జిట్లనియె.) కార్తికంబునఁ బ్రాజాపత్య
చరుండై, ఏకాంతరోపవాసియై యేకరాత్రంబునందైన షడ్రాత్ర
ద్వాదశరాత్రపక్షంబులయందేని మానసంబునందేని నుపవాసంబు
గావించిన హరిలోకప్రాప్తి యగును.

348


ఆ. వె

ఏకభుక్తయాచితేతరేతరమహా
వ్రత మొనర్చిన నట్టివాఁడు గాంచు
నవని యెల్ల సంశయము లేదు కార్తిక
మాసరాజమునను మందయాన!

349


సీ.

కార్తికంబున రమాకాంతుపూజ యొనర్చి
                       హరివాసరవ్రత మాచరించ
నరవరేణ్యుండు స్తనంధయుం డెన్నఁడుఁ
                       గాడు ప్రబోధ నీకాలమునను

  1. ("అనిన మోహినికి రా జిట్లనియె." అనునది లేదు.)