పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/454

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


క.

ఇటువంటిమాసమున నా
కుటిలాలకఁ గూడి రాజకుంజరుఁడు మహో
ద్భటమోహపరుఁడు తద్వ్రత
మెటులం గావించె నందు నేమి యొనర్చెన్.

338


వ.

అనిన వసిష్ఠుం డిట్లనియె నాకాలంబున రాజు పటహంబు మ్రోయ
మోహినిం జూచి నీతోఁగూడి పెక్కేండ్లు రమించితి. భవదవమాన
భయంబున నిన్ను వీడనైతి. ఒకటి సంప్రాప్త మయ్యెం జెప్పెద
వినుము. నీయందు మోహంబున ననేకకార్తికంబులు దాఁటె.
హరివాసరంబు దక్కఁ గార్తికంబు వ్రతంబు సేయనైతి. ఇష్టా
పూర్తంబులు వ్యర్థంబులయ్యె. తన్మాసమాహాత్మ్యంబు వినుము.

339

రాజు మోహినికి గార్తీకమాహాత్మ్యము వివరించుట

మ.

మృగయాసక్తులు మాంసభోజనులు సన్మేధాస్థితిం గార్తికో
పగమాద్యంతములందు [1]మాంసభయదంభంబుల్ విసర్జించి ప
న్నగతల్పాలయసీమ నుంద్రు నిరతౌన్నత్యంబుతో నందు నిం
పుగ భక్షానియమం బొనర్చు నరులన్ భూషింప శక్తుండనే?

340


క.

ఇలలో ననేకదానం
బులు గల్గినఁ గల్గనిమ్ము భూరిద్రవ్యం
బులు చిత్తాయాసకరం
బులు పోలునె దీపదానముల నిలలోనన్.

341


క.

ధర భూతికాముఁడగు నా
పురుషుఁడు చేయఁదగు నందు భూరియశశ్శ్రీ
కరమై ధర్మగుణంబున
కిరవై యధికమగు దాన మెయ్యది యైనన్.

342


క.

ఒకచోట సకలదానము
లొకచోటం దీపదాన ముత్కటపుణ్య
ప్రకటతసమములు సర్వా
ధికమౌ కార్తికమునందుఁ దెలివి నొనర్పన్.

343
  1. మాంసచయధంభంబుల్