పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/453

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


గుంభసంభవకళాంకురము తళ్కులు దేర
                       [1]నదులు మిన్నేఱులై పొదల నాశ్వి
నాంతంబునందు దైత్యాది మేల్కొనఁ గుసు
                       మాస్త్రశరాయత్తుఁడై యరణ్య


తే. గీ.

సారకల్హారకమలకాసారసింధు
సంగమమలయమందరసహ్యవింధ్య
హేమనగపారియాత్రమహేంద్రముఖ్య
గిరివరంబులఁ గాంతతోఁ క్రీడ సల్పె.

334


క.

దినదిన మొక్కొకచింతను
దనులావణ్యంబు నెరపి తను నప్పుడు మో
హిని మోహము నందించగ
ఘనుఁ డాతఁడు మఱచె సకలకార్యాంతరముల్.

335


క.

దురితహరమైన యాశ్రీ
హరివాసర మొకటి మఱవఁ డర్థము మఱచెన్
దరుణుల మఱచెన్ ధరణీ
భరణము మఱచెన్ జితారిభరణము మఱచెన్.

336


వ.

ఇట్లు దశమి మొదలుకొని దినత్రయంబు గంధతాంబూలపుష్పాది
కంబును స్త్రీభోగంబును విడిచి వర్జించె. పుణ్యప్రదంబైన కార్తికంబు
ప్రవేశించె. కార్తీకసమంబైన మాసంబును, గృతయుగసమంబైన
యుగంబును, వేదసమంబైన విద్యయును, గంగాసమంబైన తీర్థం
బును. జలదానసమంబైన దానంబును, ధర్మసమంబైన విత్తం
బును, సత్యసమంబైన యశంబును, నారోగ్యసమంబైన యుత్సా
హంబును, [2]గేశవసమంబైన (దైవంబును) గల్గకుండుటం జేసి
కార్తికంబున విషయప్రపణుండేని వ్రతంబు సేయక యుల్లంఘించిన
సర్వధర్మబహిష్కృతుండై తిర్యగ్యోని జనించు నని వసిష్ఠుం
డానతి యిచ్చిన మాంధాత యిట్లనియె.

337
  1. నదులు మోయేరులై పొదల నాశ్విసాంతంబునందు దైత్యారి మేల్కొనఁ
  2. గేశవసమంబైన గల్గకుండుటం జేసి