పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/452

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


యగుచుఁ బుణ్యపురంధ్రి రాణించు, నెచ్చట ప్రతిక్రోధియై యుండు,
నెచ్చట నారణ్యకుండు నగరాశ్రయుండగు, నెచ్చట ధనికుండై లోభి
యగు, నెచ్చట నిర్దయుండు వసించు, నెచ్చట గోపాలుండు పురాంతర
వర్తియగు, నెచ్చట ఋత్విజుండు సశాస్త్రుండు గాఁడు, ఎచ్చట దేశి
కాగ్రణియగు గురుండు లేఁడు, ఎచ్చట బాలిశుండు వసించు, నెచ్చట
లోహవిక్రయం బొనరింతు, రెచ్చట నీలి విక్రయంబు సేయుదు, రెచ్చట
నీలవస్త్రనిషేవణంబు గావింతు, రెచ్చట మద్యపానంబు వాటింతు,
రెచ్చట వృథామాంసభోజను లగుదు, రెచ్చట [1]స్వకళత్రపరిత్యాగులు
నిల్తు, రెచ్చట సకలసురసంపూజ్యుండగు విష్ణుదేవుని విడిచి యన్య
దేవతా[2]భజనంబు సేయుదు, రచ్చట నచ్చట వితర్కించి, వాఁ డస్మ
దీయుండు గాఁడని శిక్షింపుచున్నవాఁడని వసిష్ఠుండు మాంధాత
కిట్లనియె.

332


సీ.

ఇట్లు ధర్మాంగదుం డిల యేల నేనరుఁ
                       డైన ధర్మము సేయు నసుఖి లేఁడు
సంతానహీనుఁడై జనుఁ డుద్భవించఁడు
                       వైకుంఠనగరాధివాసి గాని
వాఁడు మృగ్యుం డగు వసుధాజనంబులు
                       తుష్టి పుష్టి దయైకదృష్టియుఁ దగి
వర్తింతు రతితృప్తి వత్సలు చెలరేఁగ
                       ఘటదౌగ్ధులౌ నాల కదుపు పితుకుఁ


తే. గీ.

బూర్ణమైయున్న ప్రతిభూజములకు సీమ
క్షౌద్రపటలంబులం దనిశంబు ద్రోణ
మాత్రమధురసధారలు చిత్రలీల
[3]గీలుకొనుఁ బండు దున్నక క్షేత్రతలము.

333


సీ.

[4]కృతయుగధర్మంబు క్రిందుఁ గావించు త్రే
                       తాద్వాపరయుగమధ్యసమయమున
గగనమార్గము ఘనాఘనలీలఁ బొరయ సు
                       ప్రభ మించి చంద్రబింబంబు మెఱయఁ

  1. స్వకళత్రపరిత్యాగంబులు నిల్తు
  2. భజనంబు సేయుదురు, యచ్చట నచ్చట
  3. గీలుకొనఁ బండు
  4. కృతయుగధర్మం బొకించు గావింపు త్రేతద్వాపరయుగమధ్యస్థలమున