పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/451

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


వివాహుండైనఁ దండ్రి [1]కృతార్థుం డగుటఁ బుత్రుండు గుణవంతుండేని
వివాహంబు సేయవలయు ననం దద్వచనంబులు విని పురోహితుండు
హర్షించి [2]సంకేతంబు లిచ్ఛామాత్రంబునం బొడమక గురువాక్యం
బునం దాఁటకయున్న ధర్మాంగదునకు వరుణాత్మజాపూర్వకంబుగా
నాగకన్యకల వివాహంబు చేసిన, మొదలఁ దండ్రికి మ్రొక్కి యంత
మోహనికిఁ గేలు మోడ్చి తదనంతరంబ సంధ్యావళి చరణంబుల కెరఁగి
నగుచు నిట్లనియె.

328


చ.

గురువచనంబుచేత మయికొంటిఁ బరిగ్రహసత్పరిగ్రహం
బురుతర[3]భక్తియుం గురుహితోక్తియు మామకజీవనంబు ని
ర్భరతరదారసంగ్రహనిరంతరభోగము లేల నాకుఁ ద
ద్గురుపదసేవయే సుకృతగుచ్ఛము నాకము నాకు నేటికిన్.

329


వ.

మనము గురుశుశ్రూష సేయందగు నన సంధ్యావళి యిట్లనియె.

330


మ.

అనఘా! సంతతభోగభాగ్యబలదీర్ఘాయుస్సమేతుండవై
జనకానుగ్రహశక్తి నీవు గలుగన్ సర్వంసహన్ శక్తి స్త్రీ
జనమూర్ధన్యత ధన్యతన్ వెలసితిన్ జాలన్ సపత్నీసతుల్
నను మన్నించఁగ మంటి నీమహిమ నానావైభవస్ఫూర్తులన్.

331


వ.

అని శిరంబు మూర్కొని యనిచిన నితర[4]జనయిత్రుల నట్లనె పూజించి
రాజ్యపాలనంబు సేయుచు నేదేశంబునందు నేప్రయోజనంబు నందు
నేమరక వర్తించె. సర్వకార్యజాగరూకనిర్వాహుండై నిలిచె.
హస్త్యశ్వరథపదాతిపోషణంబు గావించె. దుర్గసంరక్షణం బొన
రించె. తులామానంబులు నెలనెలకు శోధించె. పౌరజనగృహ
కృత్యంబు పరిశీలించె. ఎచ్చట స్తనంధయుండు స్తన్యపానంబు లేక
రోదనంబుఁ గావించు, నెచ్చట శ్వశ్రూజనావమానంబు నొంది వధూ
జనంబు దుఃఖించు, నెచ్చట సమర్థుండై తనయుండు గణన సేయక
యుండు, నెచ్చట వర్ణసంకరం బగు, నెచ్చట గూఢవిభవులై లోకులు
వర్తింతు, రెచ్చట భర్తృమతియైన యింతి కంచుకరహితయై యిల్లు
వెడలి తిరుగు, నెచ్చట సకేశయై విశ్వస్త గనఁబడు, నెచ్చట నకేశ

  1. కృతార్థుం డగుట, పుత్రుండు
  2. సంకేతంబులై యిచ్ఛామాత్రంబునం బొడమక
  3. భక్తియై గురుహితోక్తియె మామకజీవనంబు
  4. జనయిత్వల