పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/449

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


సిద్ధిమూలంబులు. చింతామణులే కాని యితరమణులు గావు.
గంధర్వులు నేనును ముప్పదిదినంబులు రణం బొనర్చి నీతేజంబున
జయించి యప్పన గొంటి. ఏను సముద్రంబు ప్రవేశించి సముద్ర
గర్భంబున నొకయేఁడు వర్తించితి. నాగశతావృతమైన భోగవతి
నిర్జించి యయుతనాగకన్యలం గొనివచ్చితి. ఫణిఫణారత్నంబులు
దెచ్చితి నచ్చట దానవమందిరంబున కేఁగి యెనిమిదివేవుర దానవీ
కన్యకల నాహరించితి. శతకోటిరత్నంబులు దీపార్థంబుగా నాపా
దించితి. యుష్మత్పరాక్రమపాలితుండనై రసాతలస్థితంబగు వారుణ
లోకంబు చొచ్చి వరుణుం గాంచి బ్రతుకవలసెదవేని మాతండ్రి
యాజ్ఞం దిరుగు మనంగ నలిగి యుద్ధసన్నద్ధుండై యొకవత్సరంబు
పోరె. అతని నారాయణాస్త్రంబునం దూలించిన సమీరవేగంబులై
విజితచంద్రప్రభాభోగంబులై యొక్కొకకర్ణంబు శ్యామంబై తృణ
తోయంబులు లేక బ్రతుకు తురంగాయుతంబును బుష్కరానుజయైన
త్రిలోకసుందరియగు నొకకన్యను భార్యార్థంబుగా సమర్పించె. ఇచ్చ
వలసిన యవి యంగీకరింపుడు. పుత్రార్జితవిత్తంబు గ్రాహ్యంబు.
శంక వలవదు. వ్యయంబు సేయుము. తండ్రియెడ నీధనంబు నే
నార్జించితినని గర్వంబున నాడికొనుపుత్రుం డాభూతసంప్లవంబుగా
నరకం బనుభవించు. కుఠారంబునుం బలెఁ బిత్రధీనుండగు కుమారుం
డిచ్చెనని తండ్రియు ననుకొనందగదు.

319


సీ.

తండ్రిశౌర్యంబునఁ దనయుండు సర్వంబు
                       [1]నార్జించుపట్టున నతనిమహిమ
[2]ధాత పన్నించు నుత్కటతృణవ్రాతంబు
                       పవనపూరితచర్మభస్త్రజలము
ధరియింపఁజేయు సూత్రప్రోతయగు దారు
                       మయయోష దిరుగు సమగ్రశక్తి
[3]నటుగానఁ బితృశక్తి యందు రా తనయుని
                       తేజోబలంబులు దెలిసి చూచి

  1. నార్జించు పట్టిన యతని మహిమ
  2. ధాత బణంచు నుత్కట
  3. నటుగాన పితృశక్తి