పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/448

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


వ.

కరికరాకారరేఖకు బిరుదు గట్టిన యవి యూరువులు, విజితశరధి
సంఘలు జంఘలు, శృంగారరసప్రగల్భంబు గుల్భంబు, నీయింతి
గలుగ నే నింద్రాదులకంటెం గృతార్థుండ నైతి నని హర్షించి యిది
వేఁడిన ధర్మాంగదుండు దక్కం బ్రాణంబేని యిత్తు ననుచు మెచ్చి
యష్టవర్షోపభోగసంలబ్ధి వర్తించునంత.

316


గీ.

తొమ్మిదవయేట ధర్మాంగదుండు మలయ
పర్వతో త్తమమున [1]మహాబలపరాక్ర
మాఢ్యుల ఘనుల (భువన)విఖ్యాతబలుల
గెలిచె నేవురు విద్యాధరుల రణమున.

317


సీ.

అప్పన దెచ్చె విద్యాధరుల జయించి
                       మణులేను నిజశక్తిమహిమ నొకటి
హాటకమయలక్షకోటిపదంబగు
                       నొకటి సహస్రశతోత్తమ[2]పట
దాయకం బొక్కటి తారుణ్యసంపద్వి
                       ధాయకనవసుధాధార లొలుకు
నొకటి [3]గృహప్రధానోత్కటధాన్యసా
                       ధనమయి కీర్తిని దనరు నొకటి


తే. గీ.

వ్యోమగమనంబు నొందించు నొరపు మెఱయ
నట్టి మణిరాజములు దెచ్చి యధికశౌర్య
ధనులు విద్యాధరాగ్రణుల్ దారు నశ్రు
పూర్ణనేత్రాంతలై తదంభోజముఖులు.

318


వ.

వెంటరా ధర్మాంగదుండు రుక్మాంగదక్షితీశుపదంబులపై వ్రాలి వీరె
యేవురు విద్యాధరులు మలయాచలంబున వీరి జయించితి వీక్షింపు
మేతద్భార్యలు సైరంధ్రులయి యీమణులచే మోహినీకాంత నలంక
రింతురు. సర్వకామప్రదంబులై పునర్యౌవనదాయకంబులై యుండు
నీమణులు దాల్చిన జీర్ణవంతులేని లావణ్యవంతు లగుదురు. ఈ
మణులు [4]వళిపలితనాశకంబులు; వస్త్రహర్మ్యసువర్ణాదిచింతిత

.

  1. మహాబలపరాక్ర-విక్రమాఢ్యుల ఘనుల విఖ్యాతబలుల
  2. పటు
  3. గృహప్రధానోత్కటంబై ధాన్య-సాధనంబై కీర్తిఁ దనరు
  4. వళితులితనాశకంబులు