పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/447

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


(యందఱును) గృహంబుల సత్యధర్మపరులై యఖిలభోగంబులు
ననుభవింపుదురు. భూమి దున్నక పండు. శిశువులకుఁ జనుబాలపుష్టి
గలదు. స్త్రీలు భర్తృభోగ[1]కలిత లగుదురు. స్వరాష్ట్రగుప్తిని
రాజులు హర్షంబు నొందుదురు. [2]ధేనువులు గోపకులు గాయక
స్వేచ్ఛాసంచారంబు చేసి వత్సక్రియలై పాలు గురియుచు [3]నిల
(య)౦బులకు వచ్చు నిట్లు రామరాజ్యప్రకారంబున నుండు నంత.

311

రుక్మాంగదుఁడు మోహినితో సుఖించుట

క.

ఇది దిన మిది రే యిది క్షణ
మిది జా మిది పక్ష మనుచు నెఱుఁగక భోగా
స్పదమగు పదమన నావిభుఁ
[4]డెదమాడి సుభోగభోగ మెసఁగ [5]రమించెన్.

312


శా.

ఆరామామణితో రమించి రవివంశాధీశుఁ డత్యంతతే
జోరమ్యత్వదృఢత్వసత్వబహువస్తుత్వంబులన్ శుక్లప
క్షారూఢద్విజరాజువోలె నుదయం బందెన్ వధూనృత్తగీ
తారంభంబులు గాంచి తద్వనితయాస్యస్ఫూర్తి వీక్షింపుచున్.

313


క.

వరకుంభికుంభపీనాం
తరనీరంధ్రాతివృత్త[6]తత్కుచము లురోం
తరమున రాయుచు ధరణీ
ధరవల్లభుఁ డమితమోహతత్పరుఁ డయ్యెన్.

314


క.

ఆరోమరేఖ యాసొగ
సారుచిరనితంబబింబ మాయొయ్యారం
బౌరా! రాజీవభవుం
డేరీతిం జేసెనో సమిద్ధత దీనిన్.

315
  1. కలితు లగుదురు
  2. ధేనువుల
  3. నిలంబులకు వచ్చుచు నిట్లు
  4. డిదమాది సుభోగ
  5. రచించెన్
  6. తత్కుచములు దొంతరమున