పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/446

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రాజులకు విశ్వాసం బన్నియెడల వలయుం గావునఁ గోశాగారపరిజ్ఞా
నంబు సేయుచు నుండుము. నీవు సుతుండవైన కతన నాకు నీ
జగన్మోహిని యైన మోహినితోడ విహరింపఁ బునర్యౌవనప్రాప్తి
యయ్యెడు. మనుష్యలోకంబున వృద్ధునకు సురతానురాగంబు
గలుగుట హాస్యకరంబు. మేను జీర్ణం బయ్యె. శిరోరుహంబులఁ బలి
తంబు వొడమె. జీర్ణుండనైన నీచే నజీర్ణుండనై భోగంబు లనుభవించెద.
నే నీకాంత నాకాంతంబు విడిచి నాకాంతయై వచ్చుటంజేసి భవద్భాహు
గుప్తుండనై [1]బర్హినిర్ఝరదివ్యనదీతటంబుల విహరింతు నీపురంధ్రి
మత్ప్రాణంబు. దివ్యకాంత. ఏతన్నిమిత్తంబుగా దేవతలు ఖేదంబు
నొందుచుంజనిరి. దీని సంరక్షింపవలయు ననిన తండ్రివాక్యంబులు
విని యుపచారంబులు గావింప నాజ్ఞానువర్తుల నియోగించి రాజ్య
భారంబు వహింపుచుండె నంత.

309


సీ.

ఈరీతి ధర్మాంగదేంద్రుండు పాలింపఁ
                       బాపబుద్ధులు లభింపరు జగములఁ
బుష్పఫలవిహీనభూరుహంబులు లేవు
                       శాలిరహితమహీస్థలము లేదు
సకలార్తిహరపాపశమనశీతారస
                       దుగ్ధమృతంబు లద్భుతము గాఁగఁ
బిదుకని మొదవుల కదుపు లెవ్వియు లేవు
                       కలఁగి దురుక్తభాషలు వచింపు


తే. గీ.

నంగనలు లేరు దుర్వృత్తులైన యట్టి
తనయులును లేరు పితృగృహస్థాయిని యగు
కన్యయును లేదు విప్రోక్తికలితభవ్య
కార్యములు చేయని మనుష్యగణము లేదు.

310


వ.

మఱియు హరివాసరంబున నెవ్వరు భుజియింపరు వారికి సంపదలు
[2]భోగదానంబులు వ్యవధానంబు నొందవు. నదులు నిదాఘంబున
శోషంబు నొందునట్లు క్షీణత నొందవు. వర్షాగమదూర్వాంకురంబులుం
బోలె నక్షయంబులగు (సస్యసంపద లొంది) దస్యుభయంబులు లేక

  1. బర్హనిర్ఝర
  2. భోగదానంబుల వ్యదాసంబు నొందవు.