పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/445

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


వ.

అనిన విని ప్రహృష్టాంతరంగుండై ధర్మాంగదుండు.

305


సీ.

ఒక్కొక్కయింతికి నొక్కొక్కకోటి హై
                       మశలాకికలును గ్రామములు వేయు
నశ్వతరీయుక్తహారికాంచనమాలి
                       రథము లెన్మిది సహస్రనవదాసి
కా నదీరత్నముల్ ఘనఘృతకుంభాయు
                       తము తైలకుంభాయుతము నజావి
కము [1]లసంఖ్యాకముల్ సమవజ్రరత్నాష్ట
                       కంబు మాణిక్యసంఘములు తాచు


తే. గీ.

[2]భూషణంబులు నమలినాశేషభూరి
హారములు చందనంబు కర్పూరములును
[3]గనక పాత్రలు మణిపాత్రకములు గోటి
కనకకుంభాష్టశతము లుత్కంఠ నిచ్చె.

306


వ.

మఱియుం గరేణువులు వింశతియు వింశతియు, నుష్ట్రంబులు [4]శతం
బును శతంబును, శిబికాదండంబులు వేయును, జామరంబులు వేయును
సవిశేషంబుగా నొసంగి ప్రదక్షిణం బొనర్చి మ్రొక్కి మోహినీమోహ
వారిధిం దేలియాడుమని మీర లనుగ్రహింపుండనఁ బుత్రవాక్యంబు
విని రాజేంద్రా! విదేహతనయతో రఘువీరుండునుం బోలె మోహినితో
విహరింపు మీమోహిని కుశకేతుపుత్రి మాకుం జెలియ లీర్ష్య యేమియు
లే దీపుత్రుండు బోధించి మాహృదయంబులు గరంగినయవి. యని
విన్నవించిన రాజు ప్రహర్షంబు నొంది ధర్మాంగదుం జూచి యిట్లనియె.

307


శా.

సప్తద్వీపపరీతభూవలయ మైశ్వర్యంబుతో నేలు మ
త్యాప్తత్రాణము దుష్టశిక్షణము శౌర్యస్ఫూర్తిచేఁ జేసి భూ
గోప్తల్ గొల్వఁగ విష్ణువాసరపరిక్షుణ్ణవ్రతాచారసం
ప్రాప్తిం ధర్మము నిల్పుమీ సుకృతసారజ్ఞుల్ ప్రశంసింపఁగన్.

308


వ.

ఎల్లప్పుడు నీవు దేశంబులు దిరుగు దానంబు వదలక కౌటిల్యంబు
లెఱింగి లోకోత్కృష్టంబైన యాచారం బెయ్యది యదయ కావింపుచు

  1. లసంఖ్యాతముల్
  2. భూషణంబులు యామలికక్యాషభూరి
  3. గనకపాత్రమణిపాత్రకములు
  4. శతంబున శతంబును