పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/443

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


శా.

[1]ఆసంధ్యావళి మేటిసాధ్వి మృదువాక్యారంభసంరంభయౌ
నీసౌభాగ్యకళాధనంబగు భవత్స్నేహంబున న్నన్నుఁ బ్రే
మాసక్తిం గరగించి షడ్రస[2]రసాభ్యాప్తంబుగా భోజనం
బీ సొక్కింతయు లేక తా నొసఁగె సౌహిత్యంబు చోద్యంబుగన్.

295


క.

[3]తరుణు లిటువంటివారలు
వరసుందరు లెందఱేని వల్లభ! నీమం
దిరమునఁ గలుగఁగఁ దత్పద
పరాగకణతుల్యగరిమఁ బరఁగఁగ నేలా?

296


వ.

అనిన సంధ్యావళియును బుత్రుండును దగ్గరనుండ మోహిని వచనం
బులు విని రాజు లజ్జ నూరకయున్న నింగితజ్ఞుఁడగు ధర్మాంగదుండు
తదవస్థ నెఱింగి సంధ్యావళీముఖ్యజననులం బిలిచి కృతాంజలియై
మోహినీరహఃక్రీడారంభపరుండై రాజు మోహించియున్నవాఁడు.
మీరు ననుగ్రహింపుండని పల్కిన వార లిట్లనిరి.

297


క.

ఈగతి నెవ్వరు పల్కుదు
రీగతి నెవ్వ రిట నడతు రిది చోద్యము పు
త్రా! గురుభక్తిపరుండవు
ప్రాగల్భ్యము నెరపి యిట్లు పలుకందగునే?

298


సీ.

ఆత్మమాంసముఁ దానె యట చవిగొను నెవ్వఁ
                       డనలంబుఁ గరమున నాను నెవ్వఁ
డత్యుగ్రవిషము భోగ్యంబుగాఁ గొను నెవ్వఁ
                       డసిచేతఁ దనతల నడఁచు నెవ్వఁ
డనుపమశిలఁ గట్టుకొని సాగరం బీదు
                       నెవ్వఁడు [4]పులినోట నెసఁగు నెవ్వఁ
డిభవైరి నట లూడ్చ నిచ్చ మైకొను నెవ్వఁ
                       డతి[5]శితఖడ్గధారాగ్రసీమఁ

  1. ఆసంధ్యావళివంటి సాధ్వి మృదువాక్యారంభసరంభయై యీ సౌభాగ్యకళాధనంబుగు భవత్స్నేహంబు
  2. రసాభ్యుక్తంబుగా
  3. తరుణీ; యిటువంటివారలు
  4. పులినోర నెసఁగు
  5. సితఖడ్గ