పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వాడిని సంహరించు" అని నారాయణికి చెప్పాడు. ఆమాట నారాయణితో చెప్పి వెనువెంటనే బయలుదేరి మహిషాసురునివద్దకు వెళ్ళి "ఓ అసురరాజా! మలయపర్వతంమీద ఉన్న నారాయణిని సతిగా స్వీకరించని నీయౌవనం యౌవనమేనా నీ కెంత బలపరాక్రమాలుండి యేమిలాభం! ఏ విధంగానైనా నీవు ఆమెను వివాహం చేసుకో!" అని చెప్పి మాయమయ్యాడు. అనంతరం మహిషాసురుడు తనను వివాహం చేసుకోవలసిందిగా నారాయణికి సందేశం పంపించాడు. చిట్టచివరికి దేవీమహిషాసురులకు మహాయుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో మహిషాసురుడు సంహరింపబడ్డాడు.

నారద మహర్షి ఒకసారి సరదాగా శ్వేతద్వీపాన్ని చూద్దామని వెళ్ళాడు. అక్కడ మన్మధాకారులు అనేకమంది విష్ణురూపులుగా గోచరం కావడంతో వారిలో అసలు మహావిష్ణువెవరో గుర్తించలేక విష్ణుమూర్తిని ప్రార్థించాడు. అప్పుడు విష్ణువు ప్రత్యక్షమై నీ కేమి వరం కావాలో కోరుకో మన్నాడు. అప్పుడు నారదుడు నాకు విష్ణుమాయలు తెలియజేయవలసిందని కోరాడు. అప్పుడు విష్ణువు సరే అని నారదుణ్ణి "అదుగో దగ్గరలో ఒక చెరువుంది. ఆ చెరువులో స్నానం చేసి రా!" అని చెప్తాడు. అప్పుడు నారదుడు వెళ్ళి ఆచెరువులో మునిగి లేచేసరికి స్త్రీరూపం దాల్చుతాడు. అనంతరం నారదుడు స్త్రీగా చారుమతి అన్నపేరుతో కాశిరాజుకు కూతురుగా జన్మిస్తాడు. ఆచారుమతికి శిబిరాజుతో వివాహమవుతుంది. చారుమతి శిబిరాజులకు నగ్నజిత్తి, విప్రజిత్తి, విచ్ఛిత్తి, చారువక్త్రుడు, చిత్తుడు, అనే కుమారులు పుడతారు. ఈపుత్రులు తండ్రితో కలిసి అనేకమంది రాజులతో యుద్ధాలు చేస్తూ వారిని ఓడిస్తారు. చివరికి తమ తాత అయిన కాశిరాజుమీదకూడా వీరు దండెత్తుతారు. అయితే కాశిరాజు చేతుల్లో వీరు హతులు కాగా చారుమతి భర్తృపుత్రవిహీనయై మహాదుఃఖితయై చితి పేర్చుకుని అందులో దూకబోగా తన పూర్వరూపమైన నారదరూపం లభించింది. స్వస్వరూపం పొందిన నారదుడు మహాశ్చర్యపడి ఇదంతా కలయా! భ్రాంతియా! అని ఆలోచించి చివరికి ఇదంతా విష్ణుమాయ అని గ్రహిస్తాడు.

దేవీభాగవతం నారదపరంగానే విష్ణుమాయ గురించి ఈక్రిందివిధంగా పేర్కొన్నది. నారదుడు రావడం చూచి మహావిష్ణువుప్రక్క నున్న లక్ష్మీదేవి ప్రక్కకు తప్పుకుంటుంది. అప్పుడు నారదుడు నేను వృద్ధ మహర్షిని. నన్ను చూచి లక్ష్మి ప్రక్కకు తొలగడం బాగుండలేదు అని అంటాడు. అప్పుడు మహావిష్ణువు పరపురుషులను చూడటం మంచిది కాదుకదా. మాయ యెంతైనా చేయగలదు అని అంటాడు. అప్పుడు నారదుడు మాయాప్రభావం చూపించవలసిందిగా కోర