పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/438

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


తే. గీ.

శయ్యపైఁ [1]బండెద మధురసంబుఁ గ్రోల
నాజ్య మే నొల్ల మేని కభ్యంజనంబు
దడవని మ్మింతటిమనోరథంబు నాకు
ననుచు నద్రిజఁ బూజించె ననుదినంబు.

272


వ.

అంత నతండు కొన్నినాళ్లకు రోగబాహుళ్యవైకల్యంబు నొంది త్రికటు
కషాయంబు ప్రదేశిని నిల్చినఁ దదంగుళిదంశనంబు [2]గావింపఁ
దత్ఖండంబునం భర్తృవదనంబు జిక్కిన స్రుక్కక యతనితోఁగూడ
దుఃఖంబు లనుభవించి మురారిలోకంబునకు నేఁగె నది గావునఁ
బతిహితం బొనరించుట పతివ్రతలకు జన్మవ్రతంబు.

273


సీ.

అని పల్కుతనయుని నక్కునఁ జేర్చి సం
                       ధ్యావళి యతనిశిరోంతరము స్పృ
శించి యాఘ్రాణంబు చేసి నీ పల్కిన
                       వచనం బొనర్చెద వన్నె మెఱయ
నీర్ష్యతోఁ బాసి మోహిని భోజనముఖ్య
                       సకలోపచారముల్ సంఘటింతు
నిన్ను నొక్కఁని గని నేఁడు నూర్వురుపుత్ర
                       కులఁ గాంచినట్లనె వెలయఁగలిగె


తే. గీ.

బహునియమ బహునిర్జర బహుమహీశు
పర్వసేవావిధానసంపత్తిమహిమఁ
గంటి నినుఁ బుత్రుగాఁ దమ్మికంటివేల్పు
వంటి సాత్వికరత్నంబు [3]గెంటులేక.

274


క.

శోకానుతాపకారకు
లై కనుపట్టెడు కుమారు లట నూర్వురు దు
ష్పాకులు పుట్టెడుకంటెఁ ద
దేకకుమారుండె లోక మేలఁగఁ జాలున్.

275
  1. బండెదను మధురసంబు
  2. గావించి తత్ఖండంబు
  3. గెంటి లేక