పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/437

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


[1]కలుషకృత్యముల దుఃఖములు ప్రారబ్ధంబు
                       లై సంభవించుఁ దథ్యముగ నట్ల
యెఱిఁగి తద్దుఃఖంబునెల్ల సహించినఁ
                       బురుషోత్తముఁడు వాఁడె భూతలమున


తే. గీ.

నీవు చేసిన పాపముల్ నీవె యనుభ
వింపుచున్నాఁడ వాయమవేదనలను
స్వామి! కలనైన రోషవిషాదవృత్తి
యెఱుఁగనని భర్త నూరార్చి [2]యింతి యంత.

268


గీ.

జనకబంధుమిత్రజనకనకము దెచ్చి
యాత్మ భర్త కిచ్చి హరిని గాఁగఁ
జిత్తవీథినుంచి సేవించి భావించి
యుపచరించి చాల నుజ్జగించి.

269


మ.

మలమూత్రంబులరోఁత దీర్చి గుదసీమాభాగనిర్యాసదు
ల్జలఘోరక్రిమికోటికూటము నఖస్పర్శంబునం దార్చి క
న్నుల రేయుంబగలున్ సదా నిదురకున్కున్ లేక వేగించి యా
లలనారత్నము సేవ చేసెఁ బతియుల్లం బుల్లసిల్లం దమిన్.

270


గీ.

భర్త రోగదుఃఖభరమునఁ [3]బొగులంగ
భువనమెల్లఁ బొగులు పోల్కి సాధ్వి
తలఁచి యంత కంతఁ దాతప్యమానయై
యంతరంగసీమ నపుడు గలఁగి.

271


సీ.

నిర్జరోత్తములార! నిఖిలమాతృగణపి
                       తృగణములారా! సుధీరులార!
యారోగ్య మొసఁగుఁ డీయాత్మేశ్వరునకు నో
                       చండిక! మన్మాంసఖండరక్త
ధార లర్పించి యుద్ధతమత్తమహిషంబు
                       గావు పట్టించి యగ్రమున నిర్జ
లోపవాసములు పె క్కుండెద రేయెల్ల
                       సూచి కంటకసంచయా(౦)చితమగు

  1. కలుషకృత్యములు దుఃఖములు
  2. యింతి యెంత
  3. బొగలంగ