పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/436

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


క.

నిరతశ్రీజితుఁ డగు నా
ధరణీదివిజాధమునకు దారుణత భగం
ధరరోగం బుదయించెం
బరివేదన నొందె వాఁడు పగలున్ రేయున్.

261


క.

సర్వస్వము గొని యాతని
[1]దుర్విధునిం జేసి వేశ్య తొలఁగి చనియె నా
యుర్వీసురు భార్యామణి
నిర్వేదన లేక వచ్చి నిలిచి భజించెన్.

262


వ.

అప్పు డతండు చూచి లజ్జావనతమానసుండై యిట్లనియె.

263


మ.

అతివా! నన్ను ననుగ్రహింపు మిఁక వేశ్యామోహవిభ్రాంతి దు
ర్మతినై నే నపరాధముల్ సలిపితిన్ రాజాస్య! సంపన్మద
స్థితి గర్వించితి బేలనై, సతుల గాసింబెట్టి మూఢుండు షం
డతఁ బాటింపుచునుండుఁ బంచదశజన్మంబుల్ దురాచారుఁడై.

264


క.

ఘనజనులు నింద సేయఁగ
మొనసి దివాకీర్తి గేహమునఁ బుట్టుదునో
వనితాజనతాఖిలపా
పనితాంతనితాంతఘోరపాపము కతనన్.

265


క.

భవదీయక్రోధాద్భుత
పవిఁ దూలితి నన్నుఁ గావు పాపాత్ముని నో
యువతీ నవతీవ్రామయ
భవతీక్ష్ణ శిలీముఖముల పాలైతి నిఁకన్.

266


వ.

అని పల్కు విభునిఁ జూచి యాసాధ్వి యిట్లనియె.

267


సీ.

ఆత్మేశ! నీకు దైన్యము నొంద నేటికి
                       లజ్జించనేల యుల్లమున నాకుఁ
గోపంబు గలదె మత్కోపదగ్ధుఁడ నైతి
                       ననుచు నాడితివి జన్మాంతరోరు

  1. దుర్విదునిం జేసి