పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/435

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


తే. గీ.

హీనకేనియు స్వర్లోక మెనఁగి [1]యుండు
నీర్ష్య గర్వంబు నుడిగి [2]సమిధ్ధబుద్ధిఁ
బ్రాణవల్లభు నిష్టసపత్నిఁ జూచు
సతికి సర్వేశలోకంబు సంభవించు.

256


తే. గీ.

పతిహితముగ సపత్ని సపత్నిసేవ
చేసి నిత్యంబు రంజింపఁజేసెనేని
యట్టి సాధ్వీలలామకు నఖిలలోక
పూజితంబైన వైకుంఠపురి లభించు.

257


వ.

ఇందునకు నొకయితిహాసంబు గలదు వినుము.

258

బ్రాహ్మణవృత్తాంతము

క.

శాకలపురమున బ్రాహ్మణుఁ
డేకదురాచారుఁ డతివిహీనుఁడు వ్రతకు
ట్టాకుఁడు వానికి నొకవే
శ్యాకాంత లభించె నాత్మ హర్షం బొందన్.

259


సీ.

ఆబ్రాహ్మణద్రోహుఁ డాదరింపక యున్న
                       [3]వేశ్య కారించిన వికలవృత్తిఁ
జెండక తద్భార్య శీలసంపన్నయై
                       యాయిరువురకుఁ దా ననుదినంబు
పాదము ల్గడుగు నభ్యంగన మొనరించు
                       సంవాహన మొనర్చు సతతనియతి
బహుకాల మీరీతిఁ బరిచర్య యొనరింప
                       నావేశ్య వశ్యమోహకములైన


తే. గీ.

యౌషధములు ప్రయోగింప నందు మీఁదఁ
[4]దదురు పావకభక్షణోద్ధతిని భార్య
కాగ్రహము చూపు నాగ్రహం బంటినట్లు
శాంతి యింతయు లేక దుర్జడత నతఁడు.

260
  1. యుండు దీర్ష్య
  2. సమిద్ధబుద్ధి ప్రాణవల్లభు
  3. వేశ్యఁ గారించిన
  4. దైల నిప్పావన భక్షణోద్ధతని భార్య