పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/434

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రత్నసూత్రంబు మలయాచలంబునఁ బడిన యది గ్రహించిన తమాయి
యను దైత్యుండు మలయంబున నున్న వాని జయించి తెచ్చినది
మోహినికి నొసంగె. హిరణ్యకసిపుభార్య లోకసుందరి శంపా
సహస్రంబుఁ దొలగించు సీమంతభూషణంబు పతివెంట నేఁగుచో
సముద్రమధ్యంబున వైచినఁ దత్సాగరంబు నిజపరాక్రమంబునకు
మెచ్చి యిచ్చె నది ధమ్మిల్లరేఖయందు సవరించె. అతిశుభ్రవస్త్రంబు
లును, గంచుకంబులు నిడియె. సిద్ధహస్తంబున దేవగిరిశిఖరంబునఁ
బ్రాపించిన దివ్యమాల్యదివ్యవిలేపనంబులు సమర్పించె. దివ్యద్వీప
విజయసంప్రాప్తకామవర్ధనద్రవ్యంబులు ప్రతిపాదించె. అంత షడ్ర
సాన్నంబులు భుజియింపంజేసి తన్మాతృహస్తంబునం దానును భుజి
యించి మధురవాక్యంబుల నిట్లనియె.

253


క.

రాజోక్తి [1]నడవఁదగునో
రాజీవాసనకుమారి! రంజిల్లి మహా
తేజమున రాజులెల్లను
బూజార్హులు గారె సకలభువనంబులకున్.

254


క.

రాజహిత మొనర్చు రమణి! పట్టపుదేవి!
ప్రాతికూలవృత్తిఁ బరఁగి రాజు
మనసురాని యింతి మనుజేశుఁ గొల్చిన
జనులకెల్ల [2]దుష్టచరిత గాదె?

255


సీ.

ఆత్మేశ్వరునకు మోహంబుగా వర్తించు
                       చంద్రాస్యమీఁద మత్సరము సేయు
నతివ చతుర్థశేంద్రావధిగత[3]నర
                       కంబులఁ బడుఁ బతిఁ గడప నాడఁ
దప్తతామ్రభ్రాష్ట్రతలమున వేపించు
                       నంతకుం డటుగాన నధిపకార్య
భరణంబుచే నుండుభార్యకుఁ దగ నను
                       కూలతఁ బతిహితగుణము నెరప

  1. నడవదగనో
  2. దుష్టశీల గాదె?
  3. నరకంబులఁ బడు పతి గడుపనాడి తప్త