పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/433

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


తే. గీ.

[1]తెలివిమైఁ దల్లిఁ బూజింప దినదినంబు
నక్షయఫలంబు ప్రాపించు నంత కంత
ప్రహరకాష్ఠానిమేషసంభావ్యమాన
సుకృతరాసులు శోధింప నొకనితరమె?

249


వ.

ఇట్లు పల్కుచు విదిశాపురవీథులు దాఁటి యంతఃపురాంతరంబున నశ్వో
రసంబు [2]డిగ్గ, మోహినిం జూచి రాజు ధర్మాంగదగేహంబునకుం
జని పూజాదులు గైకొనుమని నియోగించిన.

250


క.

దరహాసచంద్రికారుచి
తిరమై తగ నపుడు రాజుదేవేరి మనో
హరమైన సుతుని మణిమం
దిరసీమకు నేఁగెఁ బూర్ణతేజం బెసఁగన్.

251


క.

ధగధగ ధిగధిగ లొలుకుచు
సొగసగు మణిపట్టసూత్రశోభితరవిబిం
బగరీయఃపర్యంకిక
దిగధీశకుమారకుఁడు సతీమణి నుంచెన్.

252


వ.

ఉంచి యంత నర్ఘ్యపాద్యంబులిచ్చి సంధ్యావళికంటె నంతరంగంబున
బ్రేమ దళుకొత్త ఘనోరుజఘనస్తన యగు నాతన్వంగిని [3]వర్షా
యుతసమన్వితంగాఁ దన్ను వక్షోత్పన్నబాలకల్పునింగాఁ జింతించి
చరణంబులుం గడిగి శిరంబునం జల్లికొని కృతకృత్యుండ నైతినని
పల్కి సర్వభోగంబులు నొసంగి క్షీరోదమథనజాతకుండలంబు
లమృతప్రభామండనంబు లైనయవి, పాతాళగర్భంబున దానవులు
దాఁచినయవి మోహిని కర్ణంబుల సంస్థాపించి యప్పు డష్టోత్తర
సహస్రధాత్రీఫలనిభశుభమౌక్తికంబుల రచియించిన హారంబులు
కంఠంబున వైచి వజ్రసంయుతంబైన శుద్ధజాంబూనదనిష్క
సూత్రంబు హారాంతరంబునం గైసేసి కరంబులం బదియాఱుమాణిక్య
స్థాపితకంకణంబులు గీలించె. మూల్యవేదులైన నరులచేత నొండొండు
నిష్కకోటి యని [4]విలువదేర నూనూరుకేయూరనూపురంబు
లొసంగి తారకాసురసంగ్రామవిభీతి కాళికాకటిస్థలచ్యుతనానా

  1. తెలివియై తల్లి పూజింప
  2. డిగ్గి
  3. వర్షాయత
  4. విలువ దేర నోనూరకేయూర