పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/432

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


[1]నన్ను గారవించి మహోదారత్వంబునం దారత్వంబుఁ గైకొనియె.
నేను నంగీకరించి దక్షిణకరం బిచ్చితి నంత మందరంబు డిగ్గి మూఁడవ
దినంబు నిచ్చటికి జనుదెంచితి నిది నీకు జనని. సంధ్యావళిసమంబు
వందనంబు గావింపుమని నియోగించిన.

243


క.

గురువాక్యంబున వారిము
గురువేణిం గాంచి భక్తి యుప్పొంగ మహా
గురుభక్తి మ్రొక్కి కాలా
గురుగంధిలనగరమధ్యకుంభినియందున్.

244


వ.

తనయుండు రా మోహినిం జూచి రాజు నగుచు ధర్మాంగదుండు
భూపతులతోఁ గూడ నమస్కరించుట నిన్నుఁ గూర్చియ కా వీని ననుగ్ర
హింపుమనఁ గృతాంజలియైన తనయునిం గాంచి హయంబు డిగ్గి
యామోహిని భర్తృదాక్షిణ్యంబున బాహువుల నుపగూహనంబు
గావింపుమని చేసి యెత్తినఁ బునర్దండప్రణామంబు చేసి సుకుసుమ
సువస్త్ర సుభూషణంబులచేతఁ దల్లి నలంకరించి తనవీపునం దల్లిపదం
బానించి హయంబు నెక్కించి రాజు నట్లనే కావించి రాజులుం దానును
బాదచారంబున ముందఱ నడుచుచుఁ దన్మోహినిఁ జూచి యిట్లనియె.

245


ఆ. వె.

లలితశుభవిలాసలక్షణవతులైన
సతులతోడఁ దండ్రి సకలభోగ
వైభవముల నుండ, [2]వర్తించు తనయుండు
ధన్యుఁ డఖిలలోకమాన్యుఁ డరయ.

246


క.

సతి యొకతియైనఁ దండ్రికి
నతిదుఃఖప్రాప్తి దెలియ నాదుఃఖము త
త్సుతులకు లభించుఁ గావున
నితరసుఖంబులు దలంచ నేటికి నింకన్.

247


క.

ఒకతల్లికిఁ బ్రణమిల్లిన
నకలంకస్ఫూర్తిఁ గల్గు నతివుణ్యంబుల్
ప్రకటమతిఁ బెక్కుతల్లుల
కొకమరి వందన మొనర్ప నొందక యున్నే?

248
  1. నన్నుఁ గారవించి
  2. వర్తించుఁ దనయుండు