పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/431

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


వ.

అనిన ధర్మాంగదుం డిట్లనియె.

237


సీ.

ఎందెందుఁ దిరిగితి రిన్నినా ళ్ళినవంశ
                       శేఖర! యిట్టి రాజీవగంధి
యెచ్చోట నబ్బె సమిద్ధసూర్యాయుత
                       తేజంబు గల్గు నీదివ్యకాంత
నలినజాతుఁడు శిల్పనైపుణి యెల్ల నీ
                       రూపంబునందునె చూపెఁ ద్రిభువ
నంబున నీదృశనవ్యశృంగారైక
                       లావణ్యఖనియైన లలన గలదె


తే. గీ.

యంబయో కుసుమశిలీముఖాంబయో ల
తాంబయగు యమమాయయో యరయ నా న
ఖరశిఖాంతంబు గాఁగ [1]నీ కలికి యొప్పు
చొప్పునం దొచ్చె ము న్నదేసొగసుగాక.

238


క.

ఇటువంటి లోకనుందరి
[2]కుటిలాలక తల్లియైనఁ గుతలంబున ను
త్కటభాగ్యసంపదలు నృప
పటలంబులలోన నాకు ఫలియించుఁజుమీ!

239


వ.

అనిన ధర్మాంగదుఁ గొనియాడి రుక్మాంగదుం డిట్లనియె.

240


క.

తురగారోహణరేఖా
త్వర నొకపక్షంబు నడచి తన్మంద్రమహీ
ధరమునఁ గాంచితి శోణా
ధరమున దరహాసరుచులు దలఁగెడు దీనిన్.

241


క.

జనయిత్రి నీకు నయ్యెడు
వనజాసనతనయ భాగ్యవతి యిది పతిగా
ననుఁ దలపోయుచుఁ దాఁ బ్రా
క్తనతీవ్రభయంకరోరుతప మొనరించెన్.

242


వ.

ఇది మందరశిఖాగ్రంబున దిగంబరేశ్వరు సేవింపుచునుండ నే తన్మంజు
మంజీరశింజితంబు విని కంజాతశరశరభిన్నహృదయుండనైన

  1. నీకలిత యొప్పు | చొప్పునం దొచ్చెము న్నదేసొగసుగాఁక
  2. కుటిలాలకి