పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/429

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


వ.

అనుచు వారలుం దాను యోజనమాత్రంబు పాదచారంబున నెదురుకొని
దండప్రణామంబులు చేసిన విభుండు హయంబు [1]డిగ్గనుఱికి
సుతులం గౌఁగిటం జేర్చి శిరంబు మూర్కొని యిట్లనియె.

229


సీ.

ప్రజల నందఱఁ బరిపాలించితే పుత్ర!
                       యరుల శిక్షించితే యనఘ! న్యాయ
[2]సముపార్జితములైన సద్వస్తుతతులఁ గో
                       శగృహంబు నిల్పితే సత్యసంధ!
విప్రులయెడల సద్వృత్తిఁ గావించితే
                       వేదాదివిద్యల వినయశీల!
కార్యదక్షతఁ గీర్తిఁ గాంచి నిష్ఠురభాష
                       ణములు వర్జించితే నయధురీణ!


తే. గీ.

బాహ్యచండాలగృహములఁ బాఁడి పిదుకు
సురభు లుండిన మాన్పితే సుగుణమూర్తి!
నీవు పాలించు జనపదనికరములను
దండ్రిమాటల నడుతురే తనయులెల్ల.

230


సీ.

అత్తమామలయాజ్ఞయందు వర్తించునే
                       పతిభక్తి గల వధూప్రకరమెల్ల
వరుస విప్రులతో వివాదముల్ దీర్తువే
                       ధేనుబృందములకుఁ దృణము జలముఁ
గలదె తులామానములు దినత్రయమున
                       శోధింతువే విప్రసుజనకోటి
నప్పనల్ గొని వీడ నందింపఁబోవక
                       యుంటివే నీ వేలు నుర్వియందు


తే. గీ.

నరయ నుదపానముఖ్యంబు [3]లచ్చికంబు
లేక యుండెనె యడిగెడు లోకులకును
భిన్నరస భిన్నఫలధాన్య భిన్నవస్త్ర
భిన్నభోజనదాతలబె ట్లణఁచితె.

231
  1. డిగ్గనురికి
  2. సౌపార్జితములైన
  3. లచ్ఛికంబు