పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/428

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


మ.

వరదివ్యాభరణంబు లాని యతిభవ్యంబైన నెమ్మేనితోఁ
దరుణాదిత్యసహస్రతేజమున దిగ్ధామంబు లుద్దీప్తులై
పరఁగంజేయుచు యోగిగమ్యమగు శ్రీపద్మామనోనాథమం
దిరగర్భంబున కేఁగె నిర్జ(రు)లు గీర్తింపంగ సద్భక్తిమై.

224


సీ.

ఆగృహగోధిక నట్లు కటాక్షించి,
                       మోహినితో గంధవాహవాహ
వాహనంబునను బర్వతవనీపాదప
                       నదనదీమృగపక్షినగరఖేట
ఖర్వటగ్రామదుర్గమ[1]ఘోరలక్ష్మిఁ గీ
                       ర్తించి చూచుచు వామదేవునాశ్ర
మప్రాంతమున నిల్చి [2]మఱియు మఱియు మ్రొక్కి
                       యనిలవేగంబున నరిగి సకల


తే. గీ.

ధనకనకవస్తుసామగ్రిఁ దనరు నిఖిల
దేశములు గాంచికొంచు నుదీర్ణపూర్ణ
రత్ననిధి యగు విదిశాపురంబుచెంత
నిలిచియున్నంత దిగ్దేశనృపులతోడ.

225

మోహినీసహితుండైన రుక్మాంగదుని స్వదేశాగమనము

వ.

ధర్మాంగదుం డొడ్డోలగంబై యుండి చారులచే విని, యుదీచిముఖంబున
వెలుంగుచున్నది మద్గురుండు రుక్మాంగదుం డరుదెంచె. తద్వాజి
తేజంబు విజృంభించెనని యెదుర్కొనం దలంచి.

226


క.

జనకుం డేతించినయెడఁ
దనయుం డెదురేఁగి మ్రొక్కఁదగుఁ గాకున్నన్
ఘనఘోరనరకకూపం
బునఁ ద్రోయకయున్నె తపనపుత్రుఁడు వేగన్.

227


తే. గీ.

తండ్రి వచ్చిన నెదురేఁగి దండనతు లొ
నర్చి నిలిచిన యట్టి యానందనునకు
నడుగు నడుగుకుఁ బ్రాపించు యజ్ఞఫలము
లనుచుఁ బౌరాణికోత్తము లాడికొండ్రు.

228
  1. ఘోరలక్షిం గీర్తించి చూచుచు
  2. మఱియు మఱియును మ్రొక్కి