పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/426

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


వ.

అట్లు గావునఁ దత్ఫలంబు నాకు నొసంగి ధర్మమూర్తీ! వైవస్వతపద
ధ్వంసీ! పాలించవే యని గృహగోధి పల్కిన విని మోహిని యిట్లనియె.

213


క.

ఇలలోపల సుఖదుఃఖం
బులు దాఁ జేయునవి తానె భుజియించు నరుం
డలవడఁగ క్షుద్ర యిది దు
ష్కలుషాత్మక దీనిఁ బ్రోవఁగా నిఁకఁ దగునే?

214


సీ.

ఇది దుష్ట దుశ్శీల యెంచ రక్షాచూర్ణ
                       ములఁ బతిఁ గారించె [1]మూఢబుద్ధి
సాధువులకుఁజే యు సదుపకారంబు స్వ
                       ర్గయశఃపదంబు లోకంబులోనఁ
బాపాత్ములకుఁ జేయు బహుళోపకారంబు
                       ఘనభయభ్రంశసాధనము శర్క
రామిశ్రదుగ్ధసారంబుఁ దాఁ(గొని) పన్న
                       గములకుఁ బోసిన గరళమైన


తే. గీ.

కరణిఁ దత్పాతకిజనోపకరణ మమరు
విడువు మీ[2]యింతిపైఁ గృప, వెడలవలయు
నగరమున కాత్మసౌఖ్య మెన్నంగఁ గలదె
యన్యకార్యాంతరాసక్తి నలసియున్న.

215


వ.

అనిన రా జిట్లనియె.

216


తే. గీ.

బ్రహ్మపుత్రివి నీ కిట్లు పలుకఁదగునె?
సాధుజనులకు నీదురాచారవృత్తి
యుక్తమే? యాత్మసౌఖ్యకరోద్యమమునఁ
బాతకమే కాని జ్ఞానసంపత్తి కలదె?

217


తే. గీ.

శశియు సూర్యుండు ననిలుండు [3]జగతిఁ బావ
కంబు హరిచందనంబు నాకద్రుమంబు
లుత్తమంబులు నవసంఖ్య నొనరుఁ గీర్తి
ఘనత నుదయించుట పరోపకారమునకె.

218

.

  1. గూఢబుద్ధి
  2. యింతిపై కృప
  3. జగతి పావ | కంబు అరిచందనంబు నాకద్రుమంబు | లుత్తములు ననల నవసంఖ్య నొనరుఁ