పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/425

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


తే. గీ.

వత్సరాయుతశతదుఃఖవనధి మునిఁగి
యున్నదాన భవత్కటాక్షోపలబ్ది
జ్ఞాన ముదయించె నాకు నో సార్వభౌమ!
హరిపరాయణు నినుఁ జూచునంతలోన.

206


క.

ధన్య యగు నింతి ధరణి న
నన్యాశ్రిత యగుచు భర్తయాత్మ యెఱిఁగి సౌ
జన్యమున నుండఁగాఁదగు
నన్యదురాచారధర్మ మది విడువఁదగున్.

207


క.

భర్తయె దేవుఁడు గురుఁడున్
భర్తయె లోకంబు లోనఁ బరదైవంబున్
భర్తకుఁ గూర్చక[1]యుండు న
భర్తృమతికిఁ గలవె తదిహపరసౌఖ్యంబుల్.

208


క.

పతిమాటలోనఁ దిరుగని
సతి క్రిమికాష్ఠోపమానసరణిం దిర్య
క్ఛతయోనుల జన్మించున్
బతి హిత మొనరింపవలయుఁ [2]బద్మాక్షులకున్.

209


మ.

శ్రవణద్వాదశినాఁటి పుణ్య మిడి రాజా నన్ను రక్షించు త
చ్ఛ్రవణద్వాదశి నర్మదాసురనదీసంగంబునం దీరమా
డు విశేషంబు జనింపఁజేయునట నీడుం గర్మజాలంబు త
ద్దివసస్నానము సర్వతీర్థఫలసిద్ధిం బొంద నిల్పుం ధరన్.

210


ఆ. వె.

[3]దత్తకల్పధర్మదైవార్చనాదు ల
క్షయఫలంబు లొసఁగు సార్వభౌమ!
విష్ణుభక్తినియతి విజయాదినవ్రత
యెవ్వఁ డాచరించు నీతనికిని.

211


క.

ద్వాదశ్యుపవాసంబు త్ర
యోదశిఁ బారణము సేయ [4]నుత్తమఫల మా
పాదించు ద్వాదశాబ్దఫ
లాదులు దన్మహిమ యింత యం తనఁదగునే?

212
  1. యుండిన భర్తుమతికిఁ గలదె
  2. బద్మాక్షునకున్
  3. దత్తజల్ప
  4. నుత్తమఫలమా పాటించు