పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/424

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


సీ.

అక్షసూత్రంబుఁ గరాగ్రంబున వహించి
                       వింతగా జపముఁ గావించుదానిఁ
బరితస్సభాసదబర్హి [1]బర్హివ్యజ
                       నానిలసుఖలీల లందుదాని
నవ్యభస్మోద్ధూళనస్ఫుటధావళ్య
                       ధాళధళ్యశ్రీలఁ దనరుదానిఁ
గాషాయవస్త్రసంఘటితయై దీర్ఘజ
                       టామకుటం తేటగలదాని


తే. గీ.

గురుతరస్తంభశతశుభ్రకుట్టిమోరు
హర్మ్యతలమునఁ దేజంబు నందుదాని
వ్రతపరాయణశీలయై వరలుదాని
యోగినీమణిఁ గనుఁగొంటి నొక్కదాని.

204


వ.

కాంచి పదములపై వ్రాల మద్భావం బెఱింగి ప్రసన్నయై చూర్ణంబును
రక్షయు నొసంగి యీచూర్ణంబు క్షీరంబులతోఁ గూర్చి భర్తకుఁ
ద్రావించిన, వాఁడు నీదాసుండగు నీరక్ష నీవు గళంబునం దాల్చిన
నిఖిలవశీకారంబగునని నియోగించిన నేను నట్ల కావించితి. తన్మ
హిమచే భర్త దినదినంబును గృశియించి ముఖంబున వ్రణంబులు పుట్టి
తద్వ్రణంబులం గ్రిమిసహస్రంబులు వొడిమ నస్థిచర్మావశిష్టుండై
యుండి నన్నుం బిలిచి నీదాసుండ నైతి నన్యగృహంబుల కేఁగ నన్నుం
గటాక్షింపవే యనిన నేను దద్యోగిని విన్నవించిన యువశమనౌష
ధంబు దెచ్చిఁ స్వస్థునిఁ జేసితి నంత.

205


సీ.

పంచత నొంది భూపాలక! యేను దు.
                       ర్నరకయాతనల [2]దైన్యంబుఁ గంటిఁ
దప్తతామ్రభ్రాష్ట్రతలమునఁ బదియేను
                       యుగములు క్రకచాళి నొత్తి తనువు
ఖండించి తిలమాత్రఖండముల్ గావించి
                       వేచి పాకంబు గావించి నంత
సంతకభటులు నే నంతట గృహగోధి
                       కాకృతి యమునాజ్ఞ నవనిఁ బుట్టి

  1. బర్హవ్రజనానీని సుఖలీల
  2. దైన్యంబుఁ గాంచి తపతామ్ర